Advertisementt

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. అసలు కహానీ ఏంటి?

Sun 24th May 2020 05:41 PM
mythri movie producer,jr ntr,prasanth neel,yash,kgf,hit director,kannada cine industry  ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. అసలు కహానీ ఏంటి?
This is the real Story behind the Jr Ntr and Prasanth neel Meet ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. అసలు కహానీ ఏంటి?
Advertisement
Ads by CJ

మొదటి నుండి హిట్ డైరెక్టర్స్ వెంట పడతాడు ఎన్టీఆర్ అనే విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఏ డైరెక్టర్ సూపర్ హిట్ కొట్టినా.. అతనితో నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా ఉండేది. అంటే ఎన్టీఆర్ ఆ డైరెక్టర్ కి అంత గట్టిగా లాకయ్యేవాడు. సూపర్ హిట్ చూసేవాడు కానీ.. ఆ డైరెక్టర్ దగ్గర కథని పట్టించుకునేవాడు కాదు. అందుకే ఎన్టీఆర్ వరసగా చాలా ప్లాప్స్ కొట్టాడంటారు. అయితే తాజాగా ఎన్టీఆర్ చేసిన పనికి ఓ డైరెక్టర్ అడ్డంగా బుక్ అయ్యాడు. కన్నడలో యశ్ అనే సాధారణ హీరోతో తెరకెక్కించిన కెజిఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. దానితో ప్రశాంత్ నీల్ పై చాలామంది స్టార్ హీరోల దృష్టి పడింది. ఈలోపు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ని కలిసినట్టుగా వార్తలొచ్చాయి.

ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ కథ వినిపించడం అది ఎన్టీఆర్ ఓకే చెయ్యడం జరిగింది అని అన్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్, కెజిఎఫ్ సినిమా చూసి ప్రశాంత్ నీల్ తో మీటింగ్ ఏర్పాటు చెయ్యమని మైత్రి మూవీస్ నిర్మాతలకు చెప్పాడట, ఆ విషయాన్నీ మైత్రి మూవీస్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ చెబుతున్నాడు. తాము ప్రశాంత్ కి ఎన్టీఆర్ గురించి చెప్పగానే ప్రశాంత్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడని.. ఇంకా ప్రశాంత్ ఎన్టీఆర్‌తో కథ కూడా చెప్పలేదని.. ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ కి కథ వినిపించాల్సి ఉందని చెబుతున్నాడు. మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కోసం తహతహలాడుతుంటే... కన్నడవారు మాత్రం ప్రశాంత్ నీల్ ని ఆడుకుంటున్నారు. ఎన్టీఆర్ తో సినిమా ఎలా చేస్తావో చూస్తామంటున్నారు. మరి ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ వలన ప్రశాంత్ నీల్ అడ్డంగా ఇరుక్కున్నాడన్నమాట.

This is the real Story behind the Jr Ntr and Prasanth neel Meet:

Mythri Movie Producer talks about Movie with Jr ntr and Prasanth neel

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ