Advertisementt

మరో వుడ్‌పై కన్నేసిన పూజా హెగ్డే!

Sun 24th May 2020 09:17 AM
pooja hegde,dulquer salmaan,film industry,malayalam,heroine  మరో వుడ్‌పై కన్నేసిన పూజా హెగ్డే!
Pooja Hegde eye on one more film industry మరో వుడ్‌పై కన్నేసిన పూజా హెగ్డే!
Advertisement
Ads by CJ

పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజున్న హీరోయిన్. బాలీవుడ్ నుండి వచ్చిన పూజా హెగ్డే అక్కడ నిలదొక్కుకోలేక టాలీవుడ్ కి వచ్చి ఇక్కడ పాతుకుపోయింది. మధ్యలో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సక్సెస్ రుచి చూస్తుంది. తాజాగా ఈ ఏడాది తమిళనాట కూడా సినిమా చెయ్యబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది. పాన్ ఇండియా మూవీస్ తోనూ, ఒక్కో భాష స్టార్ హీరోలతోనూ దున్నేస్తున్న పూజా హెగ్డే క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది. తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న పూజ.. ఇంకో తెలుగు భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్‌గా పరిశీలనలో ఉంది.

అయితే తాజాగా పూజా ఏ భాషను వదలడం లేదని.. మలయాళంలో క్రేజీ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఓ ఆఫర్ పట్టేసిందనే టాక్ ఉంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఉంది. అయితే ఈ సినిమాలో దుల్కర్ సరసన పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేని టైం లో పూజా హెగ్డే ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం.. దుల్కర్ క్రేజ్ తో మలయాళంలోనూ పాగా వెయ్యొచ్చు అనే ఆలోచనతోనే పూజ ఈ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

Pooja Hegde eye on one more film industry :

Pooja hegde in Dulquer Salmaan Film 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ