Advertisementt

నో పెళ్ళి అంటున్న సాయి ధరమ్ తేజ్..

Sat 23rd May 2020 05:16 PM
nopelli,solobrathukesobetter,sai dharam tej,nabha natesh,svcc,bvsn prasad  నో పెళ్ళి అంటున్న సాయి ధరమ్ తేజ్..
Sai Dharam TEj Says No pelli.. నో పెళ్ళి అంటున్న సాయి ధరమ్ తేజ్..
Advertisement
Ads by CJ

ఆరు వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ దక్కించుకుని, ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

క్యాచీ టైటిల్ తో సింగిల్స్ ని అట్రాక్ట్ చేసేలా ఉన్న ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండీ నో పెళ్ళి అనే సాంగ్ విడుదల కానుంది. మే 25వ తేదీ ఉదయం 10గంటలకి నో పెళ్ళి అనే సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ కానుందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

టాలీవుడ్ లో బ్యాచులర్స్ అందరూ ఒక్కొక్కరూ పెళ్ళిపీటలెక్కుతున్న వేళ సాయిధరమ్ తేజ్ సినిమా నుండి ఈ పాట విడుదల కావడం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. అందుకే ఈ పాట కోసం అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. అదీగాక థమన్ మ్యూజిక్ అందించడం కూడా ఓ ప్రత్యేక కారణంగా భావిస్తున్నారు. మరి నో పెళ్ళి అనే పాట కేవలం సింగిల్స్ నే అలరిస్తుందా, లేదా పెళ్లయినవారిని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.

Sai Dharam TEj Says No pelli..:

NO pelli song will be releasing on May 25th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ