పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి కళ్యాణ్ రామ్ కి మంచి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. చేసిన ప్రతీ సినిమా ఒకదానికి మించి మరోటి హిట్ అవుతుండడంతో అందరిచూపు అనిల్ పైనే పడింది మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడి తర్వాతి చిత్రం గురించి ఇంకా ఏ విధమైన అప్డేట్ రాలేదు.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాని ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్టు పనులు కూడా పూర్తయ్యాయట. కానీ కరోనా కారణంగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఈ సినిమాని అంత తొందరగా కంప్లీట్ చేయకపోవచ్చు. ప్రస్తుతం వారి చేతుల్లో ఉన్న సినిమాలే కంప్లీట్ చేయడానికి చాలా టైమ్ పడుతుంది. అవి పూర్తి చేసి అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ సమయం పట్టేలా ఉంది.
దాంతో వచ్చే సంక్రాంతికి అనిల్ సినిమా రెడీ అయ్యే అవకాశమే లేదు. వరుసగా రెండుసార్లు సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడికి ఈ సారి నిరాశ తప్పేలా లేదు.