అనుష్క శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ చిత్రం నిశ్శబ్దం రిలీజ్ పై రోజుకో ఊహాగానాలు వస్తున్నాయి. సినిమా థియేటర్లు ఇప్పుడప్పుడే తెర్చుకునే వీలు లేనందున నిశ్శబ్దం ఖచ్చితంగా ఓటీటీలోనే వస్తుందనే అనుమానాలని రేకెత్తించారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్ మరోసారి స్పందించాడు. కోనవెంకట్ మాట్లాడుతూ సినిమాపై వస్తున్న పుకార్లని నమ్మవద్దని, మా మొదటి ప్రయారిటీ థియేటర్లలో రిలీజ్ చేయడమే అని స్పష్టం చేశాడు.
ఒకవేళ థియేటర్లు తెరుచుకోవడం ఆలయమయ్యే నేపథ్యంలో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలా వద్దా అనే విషయం ఆలోచిస్తామని, అంతే తప్ప ఓటీటీలో రిలీజ్ చేయాలన్న ఆసక్తి లేదని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో రెండు నెలల వరకూ సినిమా థియేటర్లు తెర్చుకోవని అంటున్నారు. కాకపోతే మల్టీప్లెక్సుల యజమానులు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు పంపించారని వార్తలు వస్తున్నాయి. అన్నీ సేఫ్టీ మెజర్ మెంట్స్ పాటిస్తూ మరికొద్ది రోజుల్లో థియేటర్లు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు.
మరి ప్రభుత్వం గనక ఈ ప్రతిపాదనలని అంగీకరిస్తే కొద్దిరోజుల్లో థియేటర్లు తెర్చుకునే అవకాశం ఉంది. మరి అప్పటి వరకూ నిశ్శబ్దం రిలీజ్ పై వస్తున్న రూమర్లు, ఊహాగానాలు ఆగేలా లేవు..