Advertisementt

చిరు జోడీగా హాసిని.. మెగా ఫ్యాన్స్‌లో ఆశ్చ‌ర్యం

Fri 22nd May 2020 01:50 PM
genelia,heroine,lucifer remake,chiranjeevi,genelia re entry,ram charan,sujeeth  చిరు జోడీగా హాసిని.. మెగా ఫ్యాన్స్‌లో ఆశ్చ‌ర్యం
Genelia in Chiranjeevi Lucifer Remake చిరు జోడీగా హాసిని.. మెగా ఫ్యాన్స్‌లో ఆశ్చ‌ర్యం
Advertisement
Ads by CJ

స్మైలింగ్ బ్యూటీగా టాలీవుడ్‌లో పేరు పొందిన జెనీలియా డిసౌజా చాలా కాలం త‌ర్వాత సినిమాల్లోకి తిరిగి రానున్న‌ట్లు బ‌ల‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. అదీ కూడా మెగాస్టార్ జోడీగా! అవును. మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘లూసిఫ‌ర్’ తెలుగు రీమేక్‌లో న‌టించాల‌ని చిరంజీవి సంక‌ల్పించారు. ఆ మూవీ డైరెక్ష‌న్ బాధ్య‌త‌ల‌ను ‘సాహో’ ఫేమ్ సుజీత్‌కు అప్ప‌గించారు. ‘సాహో’ ఆశించిన రీతిలో ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ సుజీత్‌పై చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రూ న‌మ్మ‌కం ఉంచారు. ఈ రీమేక్‌ను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై చ‌ర‌ణ్ స్వ‌యంగా నిర్మించ‌నున్నారు.

కాగా ‘లూసిఫ‌ర్’ రీమేక్‌లో చిరు స‌ర‌స‌న జోడీగా ప‌లుపురు పేర్లు వినిపిస్తూ వ‌స్తున్నాయి. తాజాగా జెనీలియా డిసౌజా పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో ప‌లు హిట్ మూవీస్‌లో జెనీలియా న‌టించింది. ‘బొమ్మ‌రిల్లు’ సినిమాలో చేసిన హాసిని క్యారెక్ట‌ర్‌తో ఆమె తెలుగు ప్రేక్ష‌కుల ఆరాధ్య తార‌గా మారింది. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ‘ఆరెంజ్‌’లో, బ‌న్నీ జోడీగా ‘హ్యాపి’ మూవీలో న‌టించింది. ఇప్పుడు ‘లూసిఫ‌ర్’ ద్వారా టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇవ్వ‌నున్న‌దంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలోకి రావ‌డంతో మెగా ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరు, దాని త‌ర్వాత ‘లూసిఫ‌ర్’ రీమేక్‌ని చేస్తాన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దాంతో ఆ సినిమా విష‌యంలో ఫ్యాన్స్ చాలా ఆశ‌లే పెట్టుకున్నారు.

ఒరిజిన‌ల్ ‘లూసిఫ‌ర్‌’ను మ‌ల‌యాళంలో పేరుపొందిన హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్మురేపిన ఆ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. దాంతో తెలుగులోనూ అలాంటి మ్యాజిక్‌నే మెగాస్టార్ చేస్తాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇది పొలిటిక‌ల్ డ్రామా కావ‌డంతో చిరుకు స‌రైన స‌బ్జెక్ట్ అవుతుంద‌నీ, ఆయ‌న చెప్పే డైలాగ్స్‌కు విజిల్స్ ప‌డ‌తాయ‌నీ వారు ఆశిస్తున్నారు.

Genelia in Chiranjeevi Lucifer Remake :

Mega Fans Happy with Lucifer Remake Heroine Selection

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ