‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ మూవీతో రష్మిక ‘గీత’ మారింది. నాటి నుంచి నేటి వరకూ అన్నీ వరుస అవకాశాలే. అంతేకాదు.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా కొట్టేసింది. ఇటు టాలీవుడ్‌లో అటు మళయాలంలోనూ బిజిబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం సుక్కు-బన్నీ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఇంటికే పరిమితం అయిన ఈ భామ నెట్టింట అభిమానులతో ముచ్చటించింది. ఇవాళ #untoldRashmika పేరుతో తన లైఫ్‌లో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కు కొన్ని చిలిపి ప్రశ్నలు కూడా సంధించింది.
సెట్ అయ్యిందా లేదా..!?
‘నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను. మీరు ఏదైనా మంచి పేరు చెప్పండి’ అని ఫ్యాన్స్‌ను కోరింది. ఇందుకు స్పందించిన వీరాభిమానులు ‘లిల్లీ’, ‘తలా రష్మిక’, ‘మోనీ’, ‘రష్మిక విజయ దేవరకొండ’ అని చెప్పారు. అయితే మరికొందరైతే అవన్నీ మీకెందుకు మేడమ్.. రష్మిక ఆ పేరే మీకు సరిగ్గా సెట్ అయ్యింది.. ఇక చెరుపుకోవడం ఎందుకండీ అని చెబుతున్నారు. అయితే.. పేర్లు చెప్పాక రిప్లయ్ ఇవ్వడానికి ఆమె పెద్దగా సాహసించలేదు. మొత్తానికి చూస్తే.. రష్మిక రీల్ లైఫ్‌లోనే చిలిపి అని తెలుసు తాజా క్వశ్చన్‌తో రియల్ లైఫ్‌లోనే అని తెలిసిపోయిందన్న మాట.
అందుకేనా..!?
కాగా.. ‘పుష్ప’లో సినిమా మంచి పేరు కోసం దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారని.. ఆ ఛాయిస్ రష్మికకే వదిలేశారట. అందుకే ఆ భామ ఆలోచించి.. ఏదీ తోచకపోయేసరికి ఇలా ఫ్యాన్స్‌కే టెస్ట్ పెట్టిందని తెలియవచ్చింది. మరి కావాల్సిన పేరు వచ్చిందో లేదో అనేదానిపై మాత్రం రిప్లయ్ ఇవ్వలేదు. అయితే కొందరైతే అతిగా స్పందించి ‘రష్మిక విజయ్ దేవరకొండ’ అని సూచించడం గమనార్హం. దీనిపై స్పందిస్తే కాంట్రవర్సీ అవుతుందేమో అని రష్మిక మిన్నకుండిపోయింది. ఇదిలలా ఉంటే.. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభమైంది. కరోనాతో వాయిదా పడ్డ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.