మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాంట్రవర్సీలతో అటు మీడియాలో.. ఇటు జనాల నోళ్లలో నానుతున్నాడు. అంతేకాదు.. సొంత పార్టీ కార్యకర్తలు, మెగాభిమానుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి. అభిమానుల నుంచి వస్తున్న కొన్ని కొన్ని కామెంట్స్‌ను చూసిన నాగబాబే అసలు తాను చేయాల్సిన ట్వీట్స్‌నే ఇవి..? అని పలు సందర్భాల్లో పునరాలోచన కూడా చేశాడట. మరోవైపు మెగాభిమానులు ఎందుకు సార్ మీరు.. ఫ్యామిలీ పరువు తీస్తున్నారు.. అసలు మీ వల్ల మీ కుటుంబానికి కానీ లేదా టాలీవుడ్‌కు కానీ ఏమైనా ప్రయోజనం ఉందా..? అని కూడా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
వాస్తవానికి.. ఆ మధ్య పాపులర్ అవ్వడానికి శ్రీరెడ్డి, కత్తి మహేశ్ లాంటి వారు కాంట్రవర్సీని వెతుక్కునేవారు. రోజుకో కాంట్రవర్సీతో హాట్ టాపిక్ అయ్యేవారు. దీన్నే అదనుగా చేసుకుని కొన్ని చానెల్స్, వెబ్ సైట్స్ తెగ రేటింగ్స్ తెచ్చేసుకున్నాయి. ఆ తర్వాత యథావిధిగా ఎవరిదారి వారిదే. ఆ కాంట్రవర్సీ వల్ల వాళ్లకు పైసా ఒరిగిందేమీ లేదు.. దీంతో బుద్ధొచ్చిన వాళ్లు ఇక ఇవన్నీ ఎందుకు మన బతుకుదెరువుదో చూసుకోవాలని మిన్నకుండిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొందరైతే కాంట్రవర్సీతోనే సహాజీవనం చేసేస్తున్నారు.
పోనీ మీకేమైనా.. అందరిలాగా ఇప్పట్లో పాపులారిటీ కావాలా..? అసలు ఇలాంటి కాంట్రవర్సీ ట్వీట్స్ చేయడం వల్ల మీకేమైనా ఒరుగుతుందా..? మీకంటూ ఓ రాజకీయ పార్టీ ఉంది. అంతకుమించి మెగా ఫ్యామిలీ అంటే ఓ బ్రాండ్ ఉంది. మీరు చేసే ఈ కామెంట్స్ వల్ల ఆ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందని మీరెప్పుడైనా ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా అనుకోలేదా..? సొంత అభిమానులు చిరు పరువు తీయకండి సార్.. అటు జనసేనకూ మీ వల్ల పైసా ప్రయోజనం లేదని అభిమానులు అంటున్నారంటే మీరు ఇప్పటికైనా పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇప్పటికే.. మీరు హిందువులపై కామెంట్స్ చేయడం.. తాజాగా గాంధీ-గాడ్సే అంటూ హడావుడి చేయడం ఇవన్నీ పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లాయ్.. కేసులు ఇవన్నీ మీకు అవసరమా..? పోనీ ఇలా చేస్తేనే మిమ్మల్ని అందరూ గుర్తెట్టుకుంటారు లేకుంటే మరిచిపోతారని మీరేమైనా భావిస్తున్నారా..? ఇవన్నీ ఏమొద్దనుకుంటే కాంట్రవర్సీని వదిలేయండి అని మెగాభిమానులు మొత్తుకుంటున్నారు. ఇకనైనా వివాదాలు, కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టేసి సాఫీగా ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా జీవితాన్ని గడిపేయండి సారూ..!