బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చి అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే బాలకృష్ణతో పూరి మరో సినిమా ఉంటుంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది కానీ.. బాలయ్య ఎక్కడా పూరి సినిమా గురించి మాట్లాడలేదు. కానీ పూరి జగన్నాధ్ మాత్రం బాలయ్యతో సినిమా ఖచ్చితంగా ఉంటుంది అంటుంటాడు. అయితే తాజాగా హీరోయిన్ ఛార్మి, పూరి - బాలయ్య కాంబో సినిమా మరోమారు రిపీట్ అవుతుంది అంటూ పక్కాగా చెబుతుంది. ఛార్మి తాజాగా అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొంది. విజయ్‌తో ఫైటర్ సినిమా, అలాగే ఆకాష్ పూరి ల రొమాంటిక్ ముచ్చట్లు ముచ్చటించిన ఛార్మి బాలయ్య గురించి బాగానే మాట్లాడింది.
బాలయ్య చాలా పాజిటివ్ గా ఉండే వ్యక్తి అని... బాలయ్య బాబుతో సినిమా చెయ్యడానికి పూరి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. వారిద్దరి మధ్యన మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. బాలయ్యతో సినిమా అంటే మంచి కథ దొరకాలి, మంచి స్క్రిప్ట్ ఉండాలి, సరైన స్క్రిప్ట్ దొరకగానే ఇద్దరు కలిసి సినిమా చేస్తారు. అంటూ బాలయ్య - పూరి కాంబో సినిమాపై ఛార్మి అనేక విషయాలు పంచుకుంది. ఇక ఛార్మి తాజాగా సినిమాల్లో నటించను అంటూ అనూహ్య నిర్ణయం తీసుకుంది కూడా. మరి ఛార్మి పూరి - బాలయ్య కాంబోపై మాట్లాడింది అంటే భవిష్యత్తులో ఆ కాంబోలో మూవీ పక్కా అన్నమాట.