Advertisementt

ఎన్టీఆర్ బర్త్ డే: నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్..

Wed 20th May 2020 02:14 AM
ntrbirthday,nara rohit,rrr,ntr,rajamouli  ఎన్టీఆర్ బర్త్ డే: నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్..
NtR birthday.. Nara Rohit special gift ఎన్టీఆర్ బర్త్ డే: నారా రోహిత్ స్పెషల్ గిఫ్ట్..
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ నేడు తన 37వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. దాంతో అభిమానుల నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. తారక్ పుట్టినరోజుకి 11 రోజుల ముందు నుండే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసిన అభిమానులు ఈ రోజు ప్రత్యేకమైన ప్లాన్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే ఏది చేసినా ప్రభుత్వం నియమ నిబంధనలకి లోబడే చేసుకోవాలనీ, భౌతిక దూరం పాటించాలనీ ఎన్టీఆర్ కోరాడు.

టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. నారా రోహిత్ ఎన్టీఆర్ కి విషెస్ చెప్తూ, ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. నారా రోహిత్ యాక్టర్ గానే మనకు తెలుసు. కానీ అతనో మంచి చిత్రకారుడన్న విషయం చాలా మందికి తెలియదు. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గీసిన చిత్రం వైరల్ అయ్యింది. అరవింద సమేత చిత్రంలో చొక్కా లేకుండా, చేతిలో కత్తి పట్టుకుని నడిచొచ్చే ఫోజ్ లో తారక్ స్కెచ్ వేసి ఆహా అనిపించాడు.

ఎక్కడా చిన్న డీటైలింగ్ మిస్ కాకుండా అతని వేసిన ఆ చిత్రం చాలా బాగుంది. కొన్ని సార్లు మాటల్లో చెప్పలేని అంశాలని కళల్లో చెప్పవచ్చు అంటారు. అందుకే నా నుండి నీకిచ్చే గిఫ్ట్ ఇదే.. హ్యాపీ బర్త్ డే తారక్ అంటూ ట్వీట్ చేశాడు. 

NtR birthday.. Nara Rohit special gift:

Nara rohit special gift for NTR birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ