‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠికి కెరీర్ లో చెప్పుకోదగిన చిత్రాలున్నప్పటికీ... ఆమెకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. గ్లామర్ షో చేసిన అవకాశాలు సన్నగిల్లాయి. తాజాగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో గడుపుతున్న లావణ్య త్రిపాఠి అభిమానులల్తో చిట్ చాట్ చేసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ లు స్ఫూర్తి తోనే తానూ సినిమాల్లోకి హీరోయిన్ గా వచ్చా అని... ఇక అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్‌పై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే.. పుష్ప ఫస్ట్ లుక్ చంపేసింది.. అల్లు అర్జున్ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయం అని చెప్పింది.
ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే.. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటుంది. అసమానతలకు ఎదురు నిలబడి పోరాటం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయన నిజమైన హీరో అన్నది. ఇక రామ్ చరణ్ సినిమాల్లో కెల్లా అయన నటించిన రంగస్థలం సినిమా సూపర్ అంటుంది. అలాగే లాక్ డౌన్ లో వండడం, తినడం, సైలెంట్ గా ఉండడం నేర్చుకున్నా అంటుంది. అంతే కాకుండా కరోనా లాక్డౌన్ లో బ్యాట్మెంటిన్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా అంటుంది. ఇక మీ బ్యూటీ సీక్రెట్ ఏమిటి అని అడిగితే.. మన మదిలో ఏముంటుందో.. మన మొహంలోను అదే కనబడితే.. అదే నిజమైన అందమంటుంది ఈ బ్యూటీ లావణ్య త్రిపాఠి.