పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ఈపాటికే థియేటర్స్‌లో దిగాల్సింది. కానీ పాపం పవన్ కళ్యాణ్‌కి కరోనా షాకిచ్చింది. కరోనా లాక్డౌన్ తో లాకయినా పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కాలో కరోనా లాక్ డౌన్ ముగిస్తే కానీ తెలియదు. వకీల్ సాబ్ సంగతి అలా ఉంచితే క్రిష్ తో మరో సినిమా చేసున్న పవన్.. ఆ సినిమా కోసం బాగా కష్టపడాలి, అలాగే డేట్స్ కూడా కేటాయించాల్సి ఉంది. ఇక క్రిష్ కూడా పవన్ కోసం పక్కా ప్రణాళికలు వేసుకుని కూర్చుకున్నాడు. కానీ కరోనా తో క్రిష్ సినిమా ప్రణాళికలు కూడా అతలాకుతలం అయ్యాయి.
క్రిష్ - పవన్ కళ్యాణ్ సినిమా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మొఘలాయిల కాలం నాటి పిరియాడికల్ డ్రామా కనుక.. ఈ సినిమా కోసం మూవీ యూనిట్ నార్త్ ఇండియాకు వెళ్లాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఆ ప్లాన్ మారింది. కరోనా ప్రభావం ఉన్న రాష్ట్రాలతో పనిలేకుండా లాక్ డౌన్ ముగిసే టైం కి రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి అక్కడే షూటింగ్ చిత్రీకరణ కానిచ్చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. కాదూ కూడదు నార్త్ ఇండియా అంటే సినిమా లేటవుతుంది. అందుకే క్రిష్ ఆర్ట్ డైరెక్టర్‌తో కలిసి రామోజీ ఫిలిం సిటీలో పర్యటించి అక్కడ కొన్ని ప్రదేశాలను ఎందుకుని మరీ అక్కడ ఎలాంటి సెట్స్ వెయ్యాల్సి ఉందో ప్లాన్స్ కూడా గీసేశారట. అయితే సెట్స్ పూర్తి చెయ్యడానికి గాను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మిగిలిన షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఆ టైం ని ఉపయోగించబోతున్నారట. ఇక పవన్ వకీల్ సాబ్ ముగించగానే క్రిష్ ఆఘమేఘాల మీద సినిమా పూర్తి చేస్తాడట.