బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో మరో సినిమా చేస్తున్నాం: 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట
‘మిరపకాయ్’తో సూపర్‌డూపర్ హిట్.. ‘గబ్బర్‌సింగ్’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న డైరెక్టర్ హరీశ్ శంకర్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దల కొండ గణేష్’. 2019లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ మరోసారి పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో సినిమా చేయడానికి 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా రామ్ ఆచంట, గోపి ఆచంట మాట్లాడుతూ ‘‘గద్దలకొండ గణేష్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాం. ఇప్పుడు మరోసారి పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌గారితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.