ఓటమెరుగని దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ‘RRR’ సినిమాను చెక్కుతున్నాడు. సినిమా షూటింగ్ ఇప్పటి వరకూ 70శాతం పైనే అయిపోయింది. కరోనా దెబ్బతో షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పటికే రెండు నెలలు పూర్తవ్వడం.. తాజాగా మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో ఈ భారీ బడ్జెట్ సినిమాకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. వాస్తావనికి వచ్చే ఏడాది అనగా 2021 జనవరి-08న రిలీజ్ చేయాలని ఆ లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్‌తో మూడ్నేళ్ల పాటు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌పై పెదవి విప్పాడు.
అసలేం జరిగింది!?
‘కరోనా లాక్ డౌన్‌కు ముందు ‘RRR’ ని ఎలాగైనా జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నాం. అయితే లాక్ డౌన్‌తో ప్లానింగ్ మొత్తం దెబ్బతింది. ఇంకా చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మిగిలే వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మిగిలే ఉన్నాయి. అందువల్ల ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేం’ అని తేల్చేశాడు దానయ్య. అంటే రెండోసారి అనుకున్న డేట్‌కు కూడా ‘RRR’ రిలీజ్ కాలేదన్న మాట. అయితే.. ఇలా రిలీజ్ డేట్‌పై దానయ్య మాట్లాడటంపై జక్కన్న సీరియస్ అయ్యారట.
చెప్పాలి కదా..!?
అంతేకాదు.. కనీసం ఒక్క మాటైనా రాజమౌళికి చెప్పకుండానే ఇలా ప్రకటన చేశారట దానయ్య. పోనీ.. పరిస్థితులను బట్టి కాస్త అటో ఇటో రిలీజ్ చేస్తామని చెప్పాల్సిందిపోయి ఇలా చిత్రబృందం ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇరువురి అభిమానులు, సినీ ప్రియులు డిసప్పాయింట్ అయ్యేలా ప్రకటన చేయడం ఎంతవరకు సబబు..? అని దానయ్యపై కాస్త సీరియస్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడు అవుద్దో..!?
వాస్తవానికి సినిమా వరకూ కెప్టెన్ డైరెక్టర్.. షూటింగ్ మొదలుకుని సర్వం దర్శకుడి కనుసన్నల్లోనే నడుస్తుంది. ఈ మాటకొస్తే భారీ చిత్రాలను తెరకెక్కించిన జక్కన్నకు నిర్మాతలు ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా సరే జక్కన్న చెప్పినంతవరకూ నోరు మెదపకూడదంతే.. కానీ దానయ్య ఇలా టక్కున నోరు జారడం ఆయన్ను ఆగ్రహానికి గురిచేసిందట. సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుద్దో..? ఎప్పుడు పూర్తవుద్దో..? పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడవుతాయో..? రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో..? థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.