Advertisementt

ఈ ఏడు సినిమాలూ ఓటీటీ ఖాతాలోకే..!?

Mon 18th May 2020 12:13 PM
over the topmedia service,ott,movies,bollywood,tollywood  ఈ ఏడు సినిమాలూ ఓటీటీ ఖాతాలోకే..!?
These Seven Movies Release On OTT! ఈ ఏడు సినిమాలూ ఓటీటీ ఖాతాలోకే..!?
Advertisement
Ads by CJ

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్‌లు ముగియగా.. మే-18 నుంచి 31 వరకు 4.0 కొనసాగనుంది. అయితే ఈ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు.. అసలు థియేటర్సే ఓపెనింగ్‌లో లేవ్. దీంతో ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ ఉండే సినిమాల నిర్మాతలకు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. మరీ ముఖ్యంగా.. సినిమాల సీజన్ అంటే వేసవి.. అలాంటిది కరోనా దెబ్బతో ఒక్క సినిమా కూడా థియేటర్లలో ఓపెన్ కాలేదు. ప్రతి వేసవిలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కిటకిటలాడే మల్టీఫ్లెక్స్, థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఇది నిజంగా చిత్ర పరిశ్రమకు పెద్ద దెబ్బే.. దీన్నుంచి కోలుకోవడానికి బహుశా ఒకట్రెండు సంవత్సరాలు పట్టినా పట్టొచ్చు.

ఈ తరుణంలో.. భారీ బడ్జెట్ మొదలుకుని లో బడ్జెట్ సినిమాల వరకూ ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌)లో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ విధిలేని పరిస్థితుల్లో కొందరు విడుదల చేయడానికి సిద్ధమైపోతున్నారు. కోలీవుడ్‌లో అయితే దీనిపై రచ్చే జరుగుతోంది. కొన్ని సినిమాలను ఎంత ఆలస్యమైనా సరే థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి లాభాలు వచ్చినా రాకపోయినా ఫర్లేదు అనుకుంటున్న నిర్మాతల సినిమాలను ఓటీటీ సంస్థలు కైవసం చేసుకుంటున్నాయి. ఇలా ప్రస్తుతం ఏడు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇందులో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం మూవీస్‌ రెడీగా ఉన్నాయి.

‘పెంగ్విన్‌’ (తెలుగు, హిందీ), ‘శకుంతల దేవి’ (హిందీ), ‘గులాబో సితార’ (హిందీ), ‘లా’ (కన్నడ), ‘ఫ్రెంచ్‌ బిర్యానీ’ (కన్నడ), ‘పొన్‌మగళ్‌ వందన్‌’ (తమిళ్‌), ‘సుఫియం సుజాతాయాం’ (మలయాళం) సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. కాగా.. తెలుగులో ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ కాగా మరికొన్ని రిలీజ్ చేయాలా వద్దా..? రిలీజ్ చేస్తే పరిస్థితేంటి..? అని దర్శకనిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారు. కరోనా కష్టకాలం అంతా ఓటీటీదే అన్న మాట.

These Seven Movies Release On OTT!:

These Seven Movies Release On OTT!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ