Advertisementt

నిఖిల్ సినిమాకి అంత ఖర్చా..?

Sun 17th May 2020 05:42 PM
nikhil,karthikeya,karthikeya2,chandu mondeti,geetha arts,18 pages  నిఖిల్ సినిమాకి అంత ఖర్చా..?
High budget for Nikhil Karthikeya 2..? నిఖిల్ సినిమాకి అంత ఖర్చా..?
Advertisement
Ads by CJ

ఈ మధ్యే పెళ్ళి చేసుకుని ఒకింటివాడైన నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో తెరకెక్కనున్న 18 పేజెస్ ఒకటికాగా చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ ౨ మరోటి. ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే కార్తికేయ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న నిఖిల్, కార్తికేయ2 తో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుందామని చూస్తున్నాడు. 

ఇంకా షూటింగ్ ప్రారంభించని ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో రిలీజై ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. కాన్సెప్ట్ వీడియో కొత్తగా అనిపించడంతో సినిమా బాగుంటుందన్న ఆశలు కలుగుతున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీ ఉండనుందట. సుమారు 25 కోట్లకి పైగానే ఖర్చు అవనుందట. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయట. అందువల్ల నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుందట.

అయితే నిఖిల్ మార్కెట్ కి అంతగా ఖర్చు చేయడం కరెక్టేనా అనే వాళ్ళున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత బడ్జెట్లో సినిమాలు తీస్తేనే బెటర్ అంటున్నారు. అయితే విజువల్ గ్రాండియర్ ఉన్న సినిమాలని పరిమిత బడ్జెట్ లో తీయడం చాలా కష్టం. ఈ వార్త నిజమైతే రికవరీ చాలా కష్టం అవుతుందని అంటున్నారు.

High budget for Nikhil Karthikeya 2..?:

High budget for karthikeya 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ