Advertisementt

ఆచార్యలో అవి ఆసక్తికరం...!

Sat 16th May 2020 04:47 PM
megastar chiranjeevi,koratala shiva,ram charan,kajal,manisharma  ఆచార్యలో అవి ఆసక్తికరం...!
Interesting update from Megastar Acharya.. ఆచార్యలో అవి ఆసక్తికరం...!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సమాజానికి సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ అంశాలని ఏమాత్రం మిస్సవకుండా తన పాయింట్ ని ప్రజలకి చేరవేసే కొరటాల శివతో మెగాస్టార్ సినిమా అన్నప్పటి నుండి ఈ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా గురించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. రామ్ చరణ్- చిరంజీవి ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తి కలిగిస్తాయట. అంతే కాదు వీరిద్దరి బంధం గురుశిష్యుల మాదిరి ఉంటుందని అన్నారు. ఇంకా ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ గా కనబడుతున్నట్టు ప్రచారం జరిగింది. అదలా ఉంటే, మెగాస్టార్ ఎలివేషన్ సీన్స్ పీక్స్ లో ఉండనున్నాయట.

అభిమానులు చిరంజీవిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ అంశాలన్నీ ఇందులో ఉండనున్నాయట. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయట. మెగాస్టార్ పాత్ర చాలా స్టైలిష్ గా, స్ట్రాంగ్ గా, ఎమోషనల్ గా ఉండనుందట. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ మనల్ని కంటతడి పెట్టిస్తాయని అంటున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

Interesting update from Megastar Acharya..:

Interesting points from Megastar Acharya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ