అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ‘పుష్ప’ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళదామా అని వేచి ఉంది. కరోనా లాక్ డౌన్ ముగియగానే సుకుమార్ అండ్ టీం వెంటనే పుష్ప ఐటెం సాంగ్ తోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ అన్ని భాషలకు సరిపోయేలా మాస్ మసాలాతో దేవిశ్రీ ట్యూన్స్ రెడీ చేశాడట. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ భామ దిశా పటాని అల్లు అర్జున్ తో నర్తించబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. దిశా అందాలతో ఈ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ కావడం ఖాయమట.
అయితే ఈ పుష్ప లోని ఐటెం సాంగ్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఎర్రచందనం స్మగ్లర్స్ ని ట్రాప్ చేసేటప్పుడు వస్తుంది అని... అలాగే ఈ సాంగ్ జానపద నేపథ్యంలో సాగుతుందని.. పక్కా మాస్ అంశాలు ఈ సాంగ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. దేవిశ్రీ ఇప్పటికే అదిరిపోయే మాస్ ట్యూన్స్ రెడీ చేసుకుని కూర్చున్నాడట. ఈ సాంగ్ అన్ని భాషలకు కనెక్ట్ అవడమే కాదు... అన్ని భాషలలోను బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమంటున్నారు పుష్ప టీం సభ్యులు.