కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి మనల్ని వదిలి ఎప్పుడు వెళ్తుందనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వ్యాక్సిన్ వస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదని, అప్పటి వరకూ కరోనాతొ కలిసి జీవించడం నేర్చుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్ళిళ్ళు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ కి ముందు ఎన్నో ఊహించుకుని, ప్రశాంతగా తమ జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానిద్దాం అనుకున్నవారికి కరోనా పెద్ద షాక్ ఇచ్చింది.
దీంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. టాలీవుడ్ హీరో నిఖిల్ మొదటి విడత లాక్డౌన్ పెట్టినపుడు తన పెళ్ళిని వాయిదా వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ లాక్డౌన్ ని పొడిగించడంతో ఇక చేసేదేమీ లేక ప్రభుత్వం సూచించిన నియమాల ప్రకారం అతి తక్కువ మంది బంధువులతో పెళ్ళి జరుపుకొన్నాడు. దీంతో హీరో నితిన్ కూడా లాక్డౌన్ లో పెళ్ళి జరుపుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం హీరో నితిన్, లాక్డౌన్ లో పెళ్ళి చేసుకోవాలని అన్నుకోవట్లేదట.
అందరి బంధువుల సమక్షంలో పెళ్లి జరుపుకోవాలని భావిస్తున్నాడట. అయితే కరోనా కారణంగా పెళ్ళిళ్లకి ఇప్పట్లో అనుమతి లభించేలా లేదు. ఫంక్షన్లకి వేలల్లో మంది వస్తుంటారు. కాబట్టి అలాంటి చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కష్టమవుతుంది. అందుకని కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే నితిన్ పెళ్ళి ఉంటుందని, అది డిసెంబర్ నెలలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే రానా వివాహం కూడా అదే నెలలో జరిపించాలని సురేష్ బాబు అనుకుంటున్నాడట. అంటే టాలీవుడ్ లో పెళ్ళిళ్ళన్నీ డెసెంబరులోనే జరిగేలా ఉన్నాయి.