సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది ఇంతవరకూ కన్ఫర్మ్ కాలేదు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యి నాలుగు నెలలవుతున్న తన నెక్స్ట్ చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం, దర్శకుల విషయంలో ఒకింత గందరగోళం జరగడం అభిమానులకి నిరుత్సాహాన్ని కలగజేసింది. వంశీ పైడిపల్లితో క్యాన్సిల్ అయ్యాక గీత గోవిందం పరశురామ్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ మహేష్ సైడ్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడం అభిమానులని అయోమయంలో పడేసింది.
పరశురామ్ తన తర్వాతి చిత్రం మహేష్ తోనే అని చెప్పేశాడు. ఇప్పటికే కథ కూడ పూర్తయిందట. క్లాస్ సినిమాలు తీసే పరశురామ్, మహేష్ కోసం ఒక మెచ్యూర్డ్ లవ స్టోరీ రాసుకున్నాడట. అయితే ఇందులో అభిమానులకి కావాల్సిన పవర్ ఫుల్ డైలాగులే కాదు, ఎలివేషన్స్ కూడా ఉంటాయని హామీ ఇచ్చాడు. అయితే వీటన్నింటినీ విన్న తర్వాత మహేష్ ఎప్పుడెప్పుడు తన సినిమా ప్రకటన చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు.
అయితే ఆ ప్రకటన వచ్చే టైమ్ దగ్గరికొచ్చింది. ఈ నెల 31వ తేదీన క్రిష్ణగారి పుట్టినరోజు సందర్భంగా మహేష్- పరశురామ్ కాంబినేషన్లో వచ్చే మూవీ గురించి అధికారికంగా ప్రకటన వెలువడనుందని అంటున్నారు. గతంలోనూ క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ సినిమాల అప్డేట్లు వచ్చాయి. దాంతో మహేష్ సినిమా గురించి ఏదో ఒక విషయం తెలుస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.