స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్స్‌కి అంతగా ప్రాధాన్యత ఉండదు. కొన్ని రొమాంటిక్ సీన్స్ కి, నాలుగు డ్యూయెట్స్‌కి పరిమితం అవడం తప్ప కథలను మలుపు తిప్పి, సినిమాల్లో నిడివి ఉన్న పాత్రలు హీరోయిన్స్‌కి దొరకవు. స్క్రీన్ మొత్తం హీరోలే స్పేస్ ఆక్యుపై చేస్తే.. ఇక హీరోయిన్స్ పాత్రలకి నిడివి ఏముంటుంది. అలాంటి సినిమాలు సూపర్ హిట్స్ అయినప్పటికీ.. అందులోని హీరోయిన్ గ్లామర్ షోకి అంతగా పేరు రాదు. దర్శకుడికి, హీరోకి వచ్చిన పేరు హీరోయిన్స్ కి రాదు. అలాంటి సినిమాల్లో నటిస్తే.. మీకు తృప్తిగా అనిపిస్తుందా అని రకుల్ ని అడిగితే..
హా ఎందుకు అనిపించదు.. కమర్షియల్ చిత్రాలు బలమైన కథ, చక్కటి కామెడీ, హీరో హీరోయిన్స్ క్రేజ్, ఇమేజ్, సాంగ్స్ ఫాన్స్ కి నచ్చేలా ఉంటాయి. కాబట్టిపాత్ర నిడివి గురించి ఆలోచించం. అందం అభినయం, నృత్యంతో అందరిని తృప్తి పరిచామా లేదా అనేది చాలు తృప్తి కలుగుతుంది. కథా బలమున్న చిత్రాల్లో హీరోయిన్స్ పాత్ర నిడివి తక్కువగా ఉన్న.. దాని ప్రభావం సినిమా మొత్తం ఉంటుంది. అలాంటి పాత్రలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి అని... అందుకే కథల ఎంపికలో పాత్ర నిడివి గురించి ఆలోచించకూడదని చెబుతుంది.