Advertisementt

RRR.. మరోసారి వాయిదా తప్పడం లేదు

Sun 17th May 2020 12:38 PM
rrr,producer,dvv danayya,postponed,rrr movie,corona  RRR.. మరోసారి వాయిదా తప్పడం లేదు
RRR producer DVV Danayya talks about Movie Release RRR.. మరోసారి వాయిదా తప్పడం లేదు
Advertisement
Ads by CJ

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని జులై 30 న విడుదల చేద్దామనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ వలన సినిమాని జనవరి 8, 2020 కి వాయిదా చేసారు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎలాగోలా పూర్తి చేసి సినిమాని జనవరి 8 కి ఖచ్చితంగా తీసుకువద్దామని అనుకుంటే.. తాజాగా కరోనా లాక్ డౌన్ మళ్లీ ఆర్ఆర్ఆర్ ప్లానింగ్ మార్చేలా కనబడుతుంది. కనబడుతుంది కాదు.. ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల పక్క పోస్ట్ పోన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఎన్టీఆర్, మెగా ఫాన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసింది.

కరోనా లాక్ డౌన్ కి ముందు ఆర్ఆర్ఆర్ ని ఎలాగైనా జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే అనుకున్నాము, అయితే లాక్ డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. ఆర్ఆర్ఆర్ లో ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు మిగిలే వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మిగిలే ఉన్నాయి. అందువలన ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేము.... అని చెప్పడంతో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పక్కా అని తేలింది. అయితే జనవరి 8 కి పోస్ట్ ఫోన్ అయిన సినిమా ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి రెండేళ్ల క్రితం ఏప్రిల్ 28 న బాహుబలి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి ఆర్ ఆర్ ఆర్ కూడా అదే లెవల్లో హిట్ అవుద్ది అనే సెంటిమెంట్ బయలుదేరడం ఖాయం.

RRR producer DVV Danayya talks about Movie Release:

RRR movie again postponed says Producer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ