Advertisementt

సమంత అలా కనిపిస్తే.. తట్టుకోగలరా..?

Sat 16th May 2020 02:19 PM
samantha,role,the family man 2,negative role,web series  సమంత అలా కనిపిస్తే.. తట్టుకోగలరా..?
samantha negative role in the family man 2 web series సమంత అలా కనిపిస్తే.. తట్టుకోగలరా..?
Advertisement
Ads by CJ

అందమైన హీరోయిన్‌ని టెర్రరిస్ట్ గా ఊహించుకోవడానికి ఆమె అభిమానులు చాలా ఇబ్బందులు పడతారు. టాలీవుడ్, కోలీవుడ్ లోను విభిన్న పాత్రలతో సూపర్ హాట్ టాప్ హీరోయిన్‌గా ఇప్పటికీ అంటే పెళ్లి తర్వాత కూడా వెలిగిపోతున్న సమంత... ఇప్పుడు సినిమాలలో కాకుండా వెబ్ సీరీస్ లోను నటించి షాకిచ్చింది. ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సమంత నటించింది. ఎప్పుడు హాట్ గా, గ్లామర్ గా, నటన పరంగా ది  బెస్ట్ అందించిన సమంత అందరికన్నా ముందుగా వెబ్ సీరీస్ లో అడుగుపెట్టింది.

అయితే సమంత ద ఫ్యామిలి మెన్ వెబ్ సీరీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తుంది అనే టాక్ ఉంది. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ వన్ కి విపరీతమైన ఆదరణ లభించింది. పాక్ టెర్రరిస్ట్ లకు, మనోజ్ బాజ్ పాయ్ ఎన్‌ఏసికి... పాక్ టెర్రరిస్ట్ లకి మధ్య జరిగిన యాక్షన్ డ్రామా ఆ వెబ్ సీరీస్ ని ఎక్కడో నిలబెట్టింది. ఇప్పుడు సమంత సీజన్ 2 లో కనిపించబోతుంది. అయితే నెగెటివ్ షేడ్స్ అంటే ఏదో అనుకున్నవారికి ఇప్పుడు సామ్ కేరెక్టర్ చూసి షాకవ్వాల్సిందే అంటున్నారు. అంటే ఈ వెబ్ సీరీస్ లో సమంత పాక్ టెర్రరిస్ట్ గా కనబడబోతుందట. ముందు మామూలుగానే కనిపించే క్యారెక్టర్, తర్వాత స్వరూపం మార్చుకుంటుందని అంటున్నారు. మరి అందమైన హాట్ హీరోయిన్ అలా టెర్రరిస్ట్ గా గ్లామర్ లెస్ గా కనబడితే ఆమె అభిమానులు హర్ట్ అవ్వరూ. అయినా సమంత ఎప్పుడు భిన్నంగా ట్రై చేస్తుంది. ఇప్పుడూ అంతే. 

samantha negative role in the family man 2 web series:

Samantha to play a terrorist Role in The Family Man 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ