అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు చిత్రం ‘పెంగ్విన్’
జూన్ 19 నుంచి ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కీర్తి సురేశ్ - పెంగ్విన్’
మహానటి సినిమాతో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు దక్కించుకొని, తెలుగు ప్రేక్షకులకి అత్యంతగా చేరువైన నటి కీర్తి సురేశ్. ఇటీవలే నేషనల్ అవార్డ్‌ని కూడా కైవసం చేసుకున్నారు. మహానటి తరువాత కీర్తి నటించిన మరో అద్భుతమైన సినిమా పెంగ్విన్. ఆసక్తికర కథ, కథనంతో సాగిపోయే ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్ పతాకం పై కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక మహానటి చిత్రానికి థియేటర్ లోనే కాదు వరల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్టీమింగ్ నెటవర్క్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్‌క్లూజివ్ గా ఆడియెన్స్‌కి అందించబోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జూన్ 19న విడుదల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం విశేషం. అలానే అమెజాన్ ప్రైమ్ కి సంబంధించిన డైరెక్ట్ టు సర్వీస్ స్లేట్ లో దీనితో పాటు మరికొన్ని ఇతర భాష చిత్రాలను ఎక్స్‌క్లూజివ్ గా రిలీజ్ చేస్తున్నారు. పెంగ్విన్ తో కలిపి మొత్తం ఆరు సినిమాలను నేరుగా తమ స్ట్రీమింగ్ సర్వీస్ పై ప్రసారం చేయనున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ.. ‘‘అమెజాన్ లో మేము మా వినియోగదారుల మాట వింటాం, ఆ దిశగా మేము పని చేస్తాం. గత 2 ఏళ్లుగా వివిధ భాషల్లో, థియేటర్లలో విడుదలైన కొద్ది వారాలకే కొత్త రిలీజ్ లను చూసేందుకు గమ్యస్థానంగా ప్రైమ్ వీడియో రూపుదిద్దుకుంది. ఇప్పుడు మేము మరో అడుగు ముందుకేశాం. అంతా ఎంతగానో చూస్తున్న ఏడు భారతీయ సినిమాలను ఎక్స్ క్లూజివ్ గా ప్రైమ్ వీడియోపై ప్రసారం చేయనుంది, సినిమాటిక్ అనుభూతిని వారి ఇళ్ల ముంగిళ్లలోకి తీసుకురానుంది’’ అని అన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ఎంతగానో చూడాలనుకుంటున్న ఈ 7 సినిమాల విడుదల కోసం భారతీయ వీక్షకులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మా వినియోగదారుల కోసం వీటిని ఇప్పుడు మేము ప్రసారం చేయడం మా కెంతో ఆనందదాయకం. వీటిని మా వీక్షకులు ఇంట్లోనే సురక్షితంగా, సౌకర్యవంతంగా తాము ఎంచుకున్న స్క్రీన్ పై చూడవచ్చు. 4000కు పైగా పట్టణాలు, నగరాలలో వీక్షణంతో భారతదేశంలో ఎంతగానో చొచ్చుకు పోయిన ప్రైమ్ వీడియో ఇప్పుడు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లలో అందుబాటులో ఉంది. ఈ సినిమా ల కు అంది అంతర్జాతీయ రిలీజ్ ముద్రను అందించనుంది. ఈ కార్యక్రమం పట్ల మేమెంతో ఉద్వేగంగా ఉన్నాం. ఇది మా ప్రైమ్ సభ్యులను ఆనందపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్రసారం కానున్న చిత్రాలు
పొన్ మగల్ వంధల్ (తమిళం)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల తేది - మే 29, 2020
తారాగణం - జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్
రచన, దర్శకత్వం - జె.జె. ఫ్రెడరిక్
నిర్మాతలు - సూరియ, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్
గులాబో సితాబో (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల తేదీ - జూన్ 12, 2020
తారాగణం - అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా
రచన - జూహి చతుర్వేది
దర్శకత్వం - షూజిత్ సిర్కార్
నిర్మాతలు - రోన్ని లాహిరి, శీల్ కుమార్
పెంగ్విన్ (తమిళం, తెలుగు),
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల తేది - జూన్ 19, 2020
తారాగణం - కీర్తి సురేశ్
రచన, దర్శకత్వం - ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్
లా (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల తేది - జూన్ 26, 2020
తారాగణం - రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు
రచన, దర్శకత్వం - రఘు సమర్థ్
నిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్
ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల తేది - జూలై 24, 2020
తారాగణం - డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్
రచన - అవినాశ్ బాలెక్కాల
దర్శకత్వం - పన్నాగ భరణ
నిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్
శకుంతలా దేవి (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల తేది - త్వరలో ప్రకటించబడుతుంది
తారాగణం - విద్యాబాలన్ర
రచన - నాయనిక మహ్తాని, అనూ మీనన్
దర్శకత్వం - అనూ మీనన్
నిర్మాతలు - అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.
సుఫియాం సుజాతాయం (మలయాళం)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల తేది - త్వరలో ప్రకటించబడుతుంది
తారాగణం - అదితి రావు హైదరీ, జయ సూర్య
రచన, దర్శకత్వం - నరని పుజా షానవాస్
నిర్మాణం - విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్.
ఈ సినిమాలు రానున్న మూడు నెలల్లో ప్రైమ్ వీడియోపై ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు మరియు టెరిటరీస్ లలో వీటిని వీక్షించవచ్చు.