Advertisementt

పవన్ సినిమా టైటిల్‌పై క్లారీటీ ఇచ్చిన హరీష్

Fri 15th May 2020 06:25 PM
harish shankar,pawan kalyan,film title,ippude modalaindi,clarity  పవన్ సినిమా టైటిల్‌పై క్లారీటీ ఇచ్చిన హరీష్
Harish Shankar Clarity on Pawan Kalyan film Title పవన్ సినిమా టైటిల్‌పై క్లారీటీ ఇచ్చిన హరీష్
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా విడుదలై ఎనిమిదేళ్ళు అయినా సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియాని షేక్ చేసి పారేశారు. అయితే పవన్ కళ్యాణ్ రెండోసారి హరీష్ శంకర్ తో సినిమాకి ఓకే చెప్పడంతో.. ఆ సినిమాపై భీభత్సమైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే కరోనా లాక్డౌన్‌తో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేస్తున్నాడు. కరోనా లాక్డౌన్ వలన షూటింగ్స్ అన్ని వాయిదా పడ్డాయి.. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఇప్పుడు ఏం చెప్పినా తొందరే అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నాం.. ఇక మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలెడదాం అనే ఆలోచనలో ఉన్నామంటున్నాడు హరీష్ శంకర్.

అయితే ‘ఇప్పుడే మొదలైంది’ అనే పేరుకి ఈ సినిమా టైటిల్‌కి సంబంధం లేదని.. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్‌కి ముందు ‘అపుడే అయిపోయిందననుకోకు.. ఇప్పుడే మొదలైంది’ అనే డైలాగ్ విలన్ ని ఉద్దేశించి.. పవన్ చెప్పాడని... ఇక దేవిశ్రీ నేను, చిత్ర బృందం అందరం పవన్ సినిమాపై వర్క్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టే.. ‘ఇప్పుడే మొదలైంది’ అని ట్వీట్ చేశా అని.. అంతేకాని పవన్ కళ్యాణ్ టైటిల్ కి ఈ ‘ఇప్పుడే మొదలయ్యింది’ అనే మాటకి సంబంధం లేదని చెబుతున్నాడు హరీష్ శంకర్. 

Harish Shankar Clarity on Pawan Kalyan film Title :

Harish Shankar Gives Clarity about pawan Film title 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ