Advertisementt

కాబోయేవాడు ఇలా ఉండాలంటున్న రకుల్

Fri 15th May 2020 01:00 PM
rakul preet singh,manchu lakshmi,husband,qualities,heroine  కాబోయేవాడు ఇలా ఉండాలంటున్న రకుల్
Rakul Preet singh about His life Partner కాబోయేవాడు ఇలా ఉండాలంటున్న రకుల్
Advertisement
Ads by CJ

బుద్దిమంతుడు తెలివైనవాడు భర్తగా కావాలట! ఈమాట అన్నది ఎవరో కాదు ప్రస్తుతం అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు నిల్. తమిళనాట ఒకటో అరా, బాలీవుడ్‌లోను అంతే. అయితే తాజాగా కరోనా లాక్డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇంట్లోనే జిమ్ చేయడం, తమ్ముడు అమన్‌తో ఆడుకోవడం చేస్తున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో లక్ష్మి మంచు చేస్తున్న ఇంటర్వ్యూలో పార్ట్ అయ్యింది. మంచు లక్ష్మి కరోనా లాక్డౌన్ కారణముగా ఫన్ కోసం సెలెబ్రిటీస్‌ని సోషల్ మీడియాలో ఇంటర్వూస్ చేస్తుంది. అందులో భాగంగా లక్ష్మి మంచు రకుల్‌ని ఇంటర్వ్యూ చేసింది.

అందులో భాగంగా ఎలాంటి వరుడు కావాలనుకుంటున్నావ్ రకుల్ అని అడగగా.. దానికి రకుల్ ఒకప్పుడు కాబోయే భర్తకుండాల్సిన క్వాలిటీస్ చాంతాడంత లిస్ట్ ఉండేదని.. కానీ ఇప్పుడు మాత్రం బుద్దిమంతుడు, తెలివితేటలున్న అబ్బాయి అయితే చాలని చెబుతుంది. ఇక తన పనిని ఎంకరేజ్ చేసేవాడైతే మరి మంచిది అని.. అందంగా ఉండాల్సిన పని లేదని.. తెలివితేటలతో జీవితాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం ఉన్నవాడు అయితే చాలని చెప్పింది రకుల్. తనకి కాబోయే వరుడు ఎలా ఉండాలో రకుల్ చెప్పిందిగా.. మరి ట్రై చేసుకోండి.

Rakul Preet singh about His life Partner:

Rakul wants This qualities for her Husband

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ