Advertisementt

వన్ బిలియన్ వ్యూస్.. అంత ఈజీ కాదు..

Thu 14th May 2020 12:58 PM
alavaikunthapurramulo. buttabomma.allu arjun,thaman,trivikram  వన్ బిలియన్ వ్యూస్.. అంత ఈజీ కాదు..
Ala vaikunthapurramulo Album created record in YouTube.. వన్ బిలియన్ వ్యూస్.. అంత ఈజీ కాదు..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ వెనక, ఆ సినిమాకి సంగీతం అందించిన థమన్ కృషి చాలా ఉంది. ఒక సినిమాలోని పాటలు ఈ రేంజ్ లో చార్ట్ బస్టర్స్ అవుతాయని ఎవ్వరూ ఊహించలేదు. సామజవరగమనా నుండి రాములో రాములా.. బుట్టబొమ్మ.. ఇలా ఏ పాటైనా దానికదే ప్రత్యేకం. ఇండియా లెవెల్లో ఈ పాటలు సంచలనం సృష్టించాయి.

అందుకే యూట్యూబ్ లో వన్ బిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేశాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన ఈ ఆల్బమ్ కి వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలోని ట్యూన్లకి తమ సొంత భాషలో లిరిక్స్ రాసుకుని పాడుకున్నారంటే, ఈ ఆల్బమ్ ఎక్కడివరకు రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో పాటలు అనవసరం అనుకునే వాళ్లకి అల వైకుంఠపురములో సక్సెస్ ఒక చెంపదెబ్బలా అనిపించవచ్చు.

సినిమా కంటే ముందే పాటలు బ్లాక్ బస్టర్ అయితే వాటి ఇంపాక్ట్ సినిమాపై ఏ విధంగా ఉందో అలవైకుంఠపురములో సినిమాతో తెలుసుకోవచ్చు. కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసిన అల్లు అర్జున్, యూట్యూబ్ వ్యూస్ ద్వారా ఏ టాలీవుడ్ హీరో అందుకోలేని రికార్డుని నెలకొల్పాడు.

Ala vaikunthapurramulo Album created record in YouTube..:

Ala Vaikunthapurramulo Album got 1 billion views

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ