Advertisementt

పెళ్ళికి నో చెప్పిన హీరోయిన్..

Thu 14th May 2020 12:40 PM
sai pallavi,nikhil,pallavi,nithin,virataparvam,rana daggubati,love story   పెళ్ళికి నో చెప్పిన హీరోయిన్..
Heroine says No to marriage.. పెళ్ళికి నో చెప్పిన హీరోయిన్..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోని హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న భామ సాయిపల్లవి. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా, తన సినిమాల్లో ఏదో విశేషం ఉండేలా చూసుకుంటుంది. ఫిదా నుండి ప్రస్తుతం చేస్తున్న విరాట పర్వం, లవ్ స్టోరీ వరకూ అన్నీ అలాంటి పాత్రలే. గ్లామర్ పాత్రలు చేయనని తెగేసి చెప్పిన ఈ భామ నటనా ప్రాధాన్యమున్న సినిమాల్లోనే కనిపిస్తుందట.

అవకాశాలు అంతగా రాకపోయినా ఫర్వాలేదు గానీ గ్లామర్ ఒలకబోసే పాత్రలు చేయనని అంటోంది. అయితే తాజాగా ఆమె పెళ్ళిపై చేసిన స్టేట్ మెంట్ చాలా మందికి షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా తమ బ్యాచులర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి జీవితభాగస్వామితో ఒక్కటవుతున్నారు. అందుకని సాయిపల్లవి ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందన్న ప్రశ్నకి ఆమె సమాధానం చెప్పింది.

ప్రస్తుతం ఆమెకి పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యమే లేదట. ఇప్పుడు తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, పెళ్ళి ఇప్పట్లో చేసుకోనని,, అసలు చేసుకునే ఉద్దేశ్యం కూడా లేదని అందరికీ షాకిచ్చింది. పెళ్ళిపై సాయిపల్లవి చేసిన కామెంట్స్ ని నిజంగా నిజం చేస్తుందా, లేదా మరోసారి పెళ్ళి గురించి అడగకూడదన్న ఉద్దేశ్యంతో ఇలా మాట్లాడిందా అన్నది అనుమానంగా మారింది.

Heroine says No to marriage..:

Sai Pallavi says no tomarriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ