Advertisementt

రాజ్ తరుణ్ కి అమ్మగా సీనియర్ హీరోయిన్..?

Thu 14th May 2020 12:24 PM
simran,raj tarun,santish,tollywood,orey bujjigaa  రాజ్ తరుణ్ కి అమ్మగా సీనియర్ హీరోయిన్..?
Simran to play as Raj tarun Mother..? రాజ్ తరుణ్ కి అమ్మగా సీనియర్ హీరోయిన్..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఇద్దరిలోకం ఒకటే కూడా ఫ్లాప్ కావడంతో రాజ్ తరుణ్ మార్కెట్ బాగా పడిపోయింది. ప్రస్తుతం అతడి కెరీర్ నిలబడాలంటే హిట్టు తప్పనిసరి. ఇద్దరి లోకం ఒకటే తర్వాత అతడి నుండి వస్తున్న ఒరేయ్ బుజ్జిగా లాక్డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవనుందో ఎవ్వరికీ తెలియదు.

అదలా ఉంచితే వరుస ఫ్లాపులు వెంటాడుతున్న రాజ్ తరుణ్ కి, అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. సంతోష్ మోహన్ వీరంకి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రాజ్ తరుణ్ కి అవకాశం దక్కిందని అంటున్నారు. ఈ సినిమాలొ రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నాడట. వెటకారాన్ని తన యాసలో మరింత అందంగా పలికే రాజ్ తరుణ్ అయితే ఈ పాత్రకి బాగా సూటవుతాడని ఫీల్ అవుతున్నారు.

అయితే ఈ సినిమాలో హీరో అమ్మకి మంచి స్కోప్ ఉందట. ఆ పాత్ర కోసం ఎవరయినా సీనియర్ హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. సిమ్రాన్ అయితే బాగుంటుందని భావిస్తున్నారని సమాచారం. హీరోయిన్ గా తెరమరుగై పోయాక తెలుగులో సిమ్రాన్ కనిపించలేదు. ప్రస్తుతం తమిళంలో తల్లిపాత్రలు చేస్తున్న సిమ్రాన్, తెలుగులో రాజ్ తరుణ్ కి తల్లిగా కనిపించనుందని అంటున్నారు.

Simran to play as Raj tarun Mother..?:

Simran to play as Raj Tarun Mother

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ