Advertisementt

హీరో నిఖిల్ పెళ్ళి ముచ్చట్లు ఇవే..

Fri 15th May 2020 07:43 AM
hero nikhil,marriage,details,hyderabad,lockdown,  హీరో నిఖిల్ పెళ్ళి ముచ్చట్లు ఇవే..
Hero Nikhil Marriage Details హీరో నిఖిల్ పెళ్ళి ముచ్చట్లు ఇవే..
Advertisement
Ads by CJ

ముహూర్తం : గురువారం ఉదయం - 06:31 ని.లకు

వేదిక : షామిర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ 

త‌రత‌రాల శ‌క్తినీ, సార్వ‌భౌమాధికారాన్ని, గౌర‌వాన్ని, య‌థాత‌థంగా నిలుపుతామ‌నే ప్ర‌మాణ‌మే వివాహం.. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో పెళ్ళి గ‌డియలు వ‌స్తాయి. ఆ గ‌డియలు వ‌చ్చినప్పుడు జ‌ర‌గాల్సిందే. స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, కార్తికేయ‌, ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ‌, అర్జున్ సుర‌వ‌రం లాంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్‌కి పెళ్లి గ‌డియలు రానే వ‌చ్చాయి.. డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ తో నిశ్చితార్థం అయిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 16న పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌పంచం మెత్తాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపించి ఎక్క‌డి వారిని అక్క‌డే వుండేలా మ‌నుషుల మ‌ద్య దూరం వుండేలా చేసింది. ఈ ప‌రిస్థితిలో నిఖిల్ పెళ్ళి వాయిదా వేసుకున్నారు. 

అయితే క‌ళ్యాణం వ‌చ్చినా కక్కు వ‌చ్చినా ఆగ‌దు అనే పెద్ద‌ల సామెత నిజ‌మ‌వుతుంది. లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం.. ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల‌న వధువరులు ఇద్ద‌రి జాత‌కాల రీత్యా గురువారం ఉదయం 6:31 ని.లకు పెళ్ళి చేయ‌టానికి ఇరు పెద్ద‌లు నిర్ణ‌యించారు. అయితే సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లోజ్ స‌ర్కిల్‌ని మాత్ర‌మే పిలిచి షామిర్‌పేట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెళ్ళి చేయ నిశ్చ‌యించారు. ఈ పెళ్ళిలో ప్ర‌భుత్వం సూచించే అన్ని ప‌ద్ద‌తులు పాటిస్తున్నారు. అభిమానుల మ‌ద్య‌లో ఈ పెళ్ళిని ఆడంబరంగా చేసుకొవాల‌నుకున్న నిఖిల్ ఇప్ప‌డు ఈ పరిస్థితుల్లో కోవిడ్‌-19 వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే వుద్ధేశ్యం‌తో ఈ పెళ్ళి ఇలా నిరాఢంబ‌రంగా చేసుకుంటున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంభందించిన ఫోటోస్‌, వీడియోస్ మాత్రం ఫ్యాన్స్ కి సోష‌ల్ మీడియా ద్వారా అందించ‌నున్నారు. ఈ నూత‌న‌వ‌ధువ‌రుల‌ను ఎక్క‌డి వారు అక్క‌డే వుండి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నామని నిఖిల్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Hero Nikhil Marriage Details :

Hero Nikhil Marriage on May 14th at Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ