Advertisementt

ప్రేక్షకులు నన్నలా చూడడానికి ఇష్టపడట్లేదెమో..

Wed 13th May 2020 12:33 PM
rashi khanna,venky mama,world famous lover,vijay devarakonda,lockdown celebrities  ప్రేక్షకులు నన్నలా చూడడానికి ఇష్టపడట్లేదెమో..
Audience are interesting to look her.. ప్రేక్షకులు నన్నలా చూడడానికి ఇష్టపడట్లేదెమో..
Advertisement
Ads by CJ

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన బబ్లీ గర్ల్ రాశీ ఖన్నా, ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశం తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా అవకాశం తెచ్చుకోగలిగింది గానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఒకదశలో వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతుండగా వెంకీ మామా, ప్రతిరోజు పండగే చిత్రాలతో విజయాన్ని అందుకుంది ఫుల్ ఫామ్ లో ఉంది. 

ఈ రెండు సినిమాల్లో ఆమె పాత్రకి మంచి పేరే వచ్చినప్పటికీ, విజయ్ తో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలోని రాశీ పాత్రకి విమర్శలు రావడంతో ఆ పేరు కాస్త తెరమరుగైపోయింది. ఈ సినిమాలో బెడ్ సీన్స్ లో నటించడం రాశీ కెరియర్ కి మైనస్ గా మారిందని అన్నవారు కూడా ఉన్నారు. అయితే ఈ విషయంలో రాశీ ఆ పాత్ర చేయడం పట్ల ఎలాంటి రిగ్రెట్స్ లేవని తేల్చేసింది.

కాకపోతే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని పాత్రకి ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాత ఆమెకి ఓ విషయం అర్థం అయిందట. ప్రేక్షకులు తనని బబ్లీగర్ల్ గానే గుర్తిస్తున్నారనీ, అలాంటి పాత్రలు చేస్తేనే బాగా రిసీవ్ చేసుకుంటున్నారని, దానికి ఉదాహరణగా వెంకీమామా, ప్రతిరోజు పండగే సినిమాలని చూపింది. ఏదైతేనేం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోని పాత్ర ఆమెపై నెగెటివిటీ తెచ్చిందన్నది వాస్తవం.

Audience are interesting to look her..:

They dont want serious roles from me

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ