Advertisementt

అల్లు అర్జున్ ప్లానింగ్ చూస్తే మతిపోవాల్సిందే!

Thu 14th May 2020 02:48 PM
allu arjun,pan india,pushpa,bollywood,media,bunny,allu arjun sketch  అల్లు అర్జున్ ప్లానింగ్ చూస్తే మతిపోవాల్సిందే!
Allu Arjun Sketch for Pan India Entry అల్లు అర్జున్ ప్లానింగ్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఏ విషయంలో అయినా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోనే ఉంటాడు. అల వైకుంఠపురములో సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్ రావడానికి అల్లు అర్జున్ ప్లానింగ్ కారణమనే టాక్ ఉంది. తాజాగా బన్నీ పుష్ప సినిమా విషయంలోనూ అదే పాటిస్తున్నాడట. అయితే పుష్ప పాన్ ఇండియా మూవీ కాబట్టి.. సినిమా విడుదల దగ్గరనుండి సినిమాపై ఇండియా వైడ్‌గా క్రేజ్ రావాలి. అందుకే అల్లు అర్జున్ దాన్ని సెట్  చేసేపనిలో బిజీగా వున్నాడట. అదే రాజమౌళి డైరెక్షన్ లో మూవీ అయితే ఇండియా వైడ్ గా క్రేజ్ దానంతట అదే వస్తుంది. కానీ సుకుమర్ - అల్లు అర్జున్ అంటే అంతా వీజీ కాదు. ఇంతకుముందు బాహుబలితో క్రేజ్ సంపాదించిన ప్రభాస్ అదే క్రేజ్ తో సాహో చేసి ప్లానింగ్ లేకుండా ప్రమోషన్స్ లేకుండా దెబ్బతిన్నాడు. చిరు ‘సైరా’ విషయంలో సేమ్ అలానే జరిగింది.

అందుకే అల్లు అర్జున్ మాత్రం తన సినిమా విషయంలో అలా జరగకూడదని.. ముందు నుండే ప్రణాళికలు రచిస్తున్నాడట. అందులో భాగంగానే ముంబై మీడియాతో బన్నీ కాంటాక్ట్ పెంచుకోవడమే కాదు.. వాళ్ళకి ఖరీదైన బహుమతులు పంపిస్తున్నాడనే టాక్ ఉంది. అల వైకుంఠపురములో సినిమా అప్పటినుండి బన్నీ బాలీవుడ్ మీడియాతో టచ్ లో ఉన్నాడని.. పుష్ప సినిమా కోసం అప్పుడే అక్కడి మీడియాని బన్నీ వాడుతున్నాడనే టాక్ వినబడుతుంది. పుష్ప సినిమా లుక్ తోనే అందరి చూపు తనవైపు తిప్పుకుని బాలీవుడ్ కంట్లో పడడానికి బన్నీ ప్లానింగే కారణమట. మరి షూటింగ్ మొదలు కావడమే పుష్ప అప్‌డేట్స్‌ని బాలీవుడ్ మీడియాకి బన్నీ దఫదఫాలుగా వదలడానికి అప్పుడే రంగం సిద్ధం చేసాడట. మరి పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటే.. ఆ సినిమాపై ఇండియా వైడ్ అటెన్షన్ పెరగడం ఖాయం.

Allu Arjun Sketch for Pan India Entry :

Allu Arjun Pan India Planning Superb 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ