సౌత్‌ని వదిలి బాలీవుడ్ లో అడుగుపెట్టి.. అక్కడ వరస హిట్స్ తో దూసుకుపోతూ.. సౌత్ వైపు చూడని హీరోయిన్ తాప్సి కి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తాప్సి డెన్మార్క్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు తో ఎప్పటినుండో లవ్ లో ఉందనే ప్రచారం ఉంది. తాజాగా ఆ విషయాన్నీ తాప్సి కన్ఫర్మ్ చెయ్యడమే కాదు... తన జీవితంలో ఉన్న వ్యక్తి గురించి చెప్పడానికి తనకి ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది అని.. ఆ విషయం తన తల్లితండ్రులకి కూడా తెలుసు అని.. కాకపోతే మీడియాకి హెడ్ లైన్ అవ్వడం ఇష్టం లేదు.. ఇలాంటి విషయాలు తెలిసాక మీడియా నా నటన గురించి కాదు.. నా వ్యక్తిగత జీవితం గురించి రాస్తుంది అని.. ఆలా అయితే ఇన్నాళ్లుగా సంపాదించుకున్న ఫేమ్ అంతా నాశనం అవుతుంది అని చెబుతుంది.
నా తల్లితండ్రులవద్ద నా వ్యక్తిగత విషయం కానీ... ప్రేమ విషయం కానీ దాచడం నాకిష్టం ఉండదు. నాకు కాబోయేవాడు నా పేరెంట్స్ కి నా చెల్లెకి నచ్చాలి.. వాళ్ళకి నచ్చితేనే కదా జీవితాంతం సుఖంగా ఉండేది అంటూ కబుర్లు చెబుతుంది తాప్సి. ఇక తాప్సి తల్లి కూడా తాప్సి ప్రేమపై తమకు నమ్మకం ఉందని.. ఆమె స్వతహాగా ఎవరిని ఎంచుకున్నా తాప్సి నిర్ణయాన్ని గౌరవిస్తామని.. తాప్సికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అని చెబుతుంది.