Advertisementt

‘కడువ’తో ‘పుష్ప’ ఫ్యాన్‌మేడ్ పోస్టర్ కేకో కేక..!

Wed 13th May 2020 07:02 PM
pushpa,fan made poster,allu arjun,viral,sukumar  ‘కడువ’తో ‘పుష్ప’ ఫ్యాన్‌మేడ్ పోస్టర్ కేకో కేక..!
Pushpa Fan Made Poster Viral in Social Media ‘కడువ’తో ‘పుష్ప’ ఫ్యాన్‌మేడ్ పోస్టర్ కేకో కేక..!
Advertisement
Ads by CJ

సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోతున్నాడు. ఒకే ఒక్క టైటిల్ పోస్టర్ తో అందరిలో షాకిచ్చిన అల్లు అర్జున్ - సుకుమార్ లు ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఎప్పుడెత్తేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తగానే షూటింగ్ మొదలెట్టడానికి ప్రిపేర్ గా ఉన్నారు. అయితే పుష్ప ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ లో రఫ్ గా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే కుర్రాడిలా పక్కా రఫ్ లుక్ లో కనిపించాడు. ఆ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ షాకవ్వడమే కాదు... అందరూ షాకయ్యారు. అయితే ఈ సినిమాలో బన్నీ మరో లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అది పుష్ప టీం నుండి బయటికొచ్చిన ఒరిజినల్ పోస్టర్ కాదు.. ఫ్యాన్‌మేడ్ పోస్టర్. కానీ పర్ఫెక్ట్ గా పుష్ప సినిమా కథకి లింక్ అయినట్లుగా.. పుష్ప ఫస్ట్ లుక్ కి సింక్ అయ్యేలా ఉన్న అల్లు అర్జున్ మాసివ్ లుక్ పోస్టర్ అందరిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇది పృథ్వీరాజ్ నటిస్తున్న మలయాళ చిత్రం ‘కడువ’ లుక్. పృథ్వీరాజ్ ఫేస్‌కు బన్నీ ఫేస్‌ను మ్యాచ్ చేసి.. ‘పుష్ప’ కలరింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప కథపై వస్తున్న వార్తలు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా పుష్ప ఫ్యాన్‌మేడ్ పోస్టర్ ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే బ్యాచ్ కి లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపిస్తాడని... ఇక ఇదొక రివెంజ్ స్టోరీ అని ప్రచారం జరిగినట్టుగా అల్లు అర్జున్ లుక్ ని ఫ్యాన్స్ డిజైన్ చేసి మరీ వదిలారు. మరి పుష్ప ఫ్యాన్‌మేడ్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Pushpa Fan Made Poster Viral in Social Media:

Superb response to Pushpa Fan Made Poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ