Advertisementt

రామ్ అడిగిన పుట్టినరోజు కానుక..

Tue 12th May 2020 05:10 PM
covid19,coronavirus,ram pothineni,ram caharan  రామ్ అడిగిన పుట్టినరోజు కానుక..
Ram addressed to his fans.. రామ్ అడిగిన పుట్టినరోజు కానుక..
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు అభిమానులు సందడి మొదలెట్టేస్తారు. ఇక పుట్టినరోజు నాడు అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. హీరో పేరు మీదుగా కేకులు కట్ చేయడం, స్వీట్స్ పంచడం వంటివన్నీ చేస్తుంటారు. అయితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజుని జరుపుకోవద్దని అభిమానులకి విజ్ఞప్తి చేశాడు. కరోనా వల్ల దేశం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో గుంపులు గుంపులుగా చేరి నా పుట్టినరోజు జరుపుకోవడం భావ్యం కాదని, అభిమానుల ఆరోగ్యమే తనకు ముఖ్యమని, మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే నాకు బోలెడంత ఎనర్జీ అని, అందుకే నా పుట్టినరోజున(మే 15) ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దని తన విన్నపాన్ని తెలియజేశాడు. పుట్టినరోజు జరుపుకోకుండా సామాజిక దూరం పాటించడమే తనకు ఇచ్చే అతిపెద్ద బహుమానం అని అన్నాడు. గతంలో రామ్ చరణ్ కూడా తన పుట్టినరోజు వేడుకలని జరుపుకోవద్దని చెప్పిన సంగతి తెలిసిందే.

Ram addressed to his fans..:

Ram Addressed to his fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ