టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ గా కొనసాగుతున్న వాళ్లలో ఈరోజు వరకి రానా కూడా ఒకడిగా ఉన్నాడు. కానీ ఇక సింగిల్ గా ఉండేది లేదని, ఆయన చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు. వెడ్డింగ్ ప్లానర్ గా చేస్తున్న మిహికా బజాజ్ ని పెళ్ళిచేసుకుని ఒంటరి జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు చెప్పేశాడు. టాలీవుడ్ లో ఒక్కొక్క హీరో పెళ్ళి చేసుకుని సెటిల్ అవుతున్న వేళ అందరి చూపు సింగిల్ గా ఉన్న వారిపైనే పడింది.
మరీ ముఖ్యంగా ప్రభాస్ పై ఒత్తిడి మరింత పెరగనుంది. ప్రభాస్ గురించి ఎప్పుడు ఏ డిస్కషన్ వచ్చినా పెళ్ళి వద్దకి వచ్చేసరికి ఏ సమాధానమూ వచ్చేది కాదు. అదిగో ప్రభాస్ కి అమ్మాయి దొరికేసింది.. ఇదిగో ప్రభాస్ కి పెళ్ళి కుదిరేసిందంటూ వార్తలు వచ్చినా అవన్నీ వట్టి మాటలేనని తేలిపోయేది. కానీ రానా పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అందరి దృష్టి ప్రభాస్ పైనే పడింది.