రాజమౌళి అంటే పాన్ ఇండియా డైరెక్టర్ అందులో ఎలాంటి సందేహాలు ఎవ్వరికి లేవు. అలాంటి డైరెక్టర్‌తో హీరోల సినిమాలంటే వారు పాన్ ఇండియా స్టార్స్ అవ్వాల్సిందే. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసి వదిలిన రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ని RRR తో భారీగా రంగంలోకి దింపుతున్నాడు. 300 నుండి 350 కోట్ల భారీ బడ్జెట్ తో RRR సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక RRR తర్వాత రాజమౌళి చేయబోయే హీరో సూపర్ స్టార్ మహేష్ అది కన్ఫర్మ్ అయ్యింది కూడా. అంటే మహేష్ కూడా పాన్ ఇండియా ఫిలిమ్స్ లిస్ట్ లోకెళ్లబోతున్నాడు. రాజమౌళి మహేష్ తో పక్కా పాన్ ఇండియా ఫిలిం కే స్కెచ్ వేసాడట.
మహేష్ బాబుతో జేమ్స్ బ్యాండ్ తరహాలో హాలీవుడ్ యాక్షన్ ని తలపించేలా సినిమాని ప్లాన్ చెయ్యడమే కాదు... ఆ సినిమా కోసం 350 నుండి 400 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నాడట. అయితే కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో బడ్జెట్ కంట్రోల్ ఉండాలి అన్న రాజమౌళి ఇలా 350 నుండి 400 కోట్ల బడ్జెట్ పెడతాడా.. అంటే తనకో న్యాయం.. ఇతరులకో న్యాయమా అంటారు. మరి రాజమౌళి మహేష్ సినిమాని భారీ బడ్జెట్ లేకుండా ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇక మహేష్‌తో రాజమౌళి సినిమాని మే 31 న అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. కానీ రాజమౌళి RRR తర్వాతే ఏ ప్రకటనయినా ఉండేది అనే వాదన కూడా వినబడుతుంది.