Advertisementt

పవన్ 28కి మ్యూజిక్ అందించేది అతనే..

Mon 11th May 2020 04:29 PM
pspk28,pawan kalyan,harish shankar,devi prasad  పవన్ 28కి మ్యూజిక్ అందించేది అతనే..
Harish Shankar announced his next project పవన్ 28కి మ్యూజిక్ అందించేది అతనే..
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజై నేటితో 8ఏళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు ట్విట్టర్ ని షేక్ చేశారు. పది మిలియన్లకి పైగా ట్వీట్స్ వేసి ట్రెండింగ్ లో ఉంచారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ అభిమానుల ఆకలి తీర్చింది. అందుకే సినిమా రిలీజైన ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమా రిలీజై అయిందేమో అన్నంత రేంజ్ లో ట్రెండ్ చేశారు.

అయితే ప్రస్తుతం గబ్బర్ సింగ్ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేస్తున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండగా, హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. స్వతాహాగా పవన్ అభిమాని అయిన హరీష్, పవన్ ని అభిమానులెలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తాడని నమ్ముతున్నారు.

హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడట. గబ్బర్ సింగ్ సినిమాకి కూడా దేవీనే మ్యూజిక్ అందించాడు. దాంతో ఈ సినిమాకి కూడా మళ్లీ దేవీనే తీసుకున్నాడు హరీష్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సూపర్ డూపర్ హిట్ సినిమా అందించిన ముగ్గురి కలయికలో మళ్లీ రిపీట్ కానుండడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

Harish Shankar announced his next project:

Harish Shankar announced, Devi Sriprasad is the music director for PSPK28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ