నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి చిత్రాల్లో నటించింది. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకి జాతీయ ఉత్తమనటి అవార్డుని గెలుచుకుంది. మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ తెలుగులో కనిపించలేదు. మహానటి రిలీజై రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకూ మరో సినిమా రాకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే.
ప్రస్తుతం ఆమె నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తుంది. అలాగే కొత్త దర్శకుడితో మిస్ ఇండియా మూవీలో కనిపిస్తుంది. ఇంకా గుడ్ లక్ సఖి అంటూ మరో సినిమాతో మన ముందుకు రానుంది. అయితే ఇవే కాకుండా తమిళంలో తెరకెక్కిన పెంగ్విన్ కూడా ఒకటి. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కానుంది. అయితే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో పెంగ్విన్ సినిమాని డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని అమెజాన్ కి అమ్మేస్తున్నారట. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకి మంచి అమౌంట్ నే ముట్టజెప్పిందని అంటున్నారు. మరొక్క వారంలో పెంగ్విన్ సినిమా అమెజాన్ లో రిలీజ్ కానుంది. ఇదే జరిగితే చాలా మంది నిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తుంటారు.