ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Those news are false from Most eligible bachelour

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ పై ఆ వార్తలన్నీ అవాస్తవాలే..

Those news are false from Most eligible bachelour

అక్కినేని అఖిల్ నాలుగవ చిత్రంగా వస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ పై అఖిల్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందని సమాచారం. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందన్న విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా, ఈ సినిమా కోసం బాగానే తీసుకుందని వార్తలు వచ్చాయి.

అయితే ఇదిలా ఉంటే నాగార్జున ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశాడని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు పూర్తయిన ఫుటేజి తెప్పించుకుని నాగార్జున ప్రత్యేకంగా చూశాడట. అయితే రషెస్ చూశాక నాగార్జున అసంతృప్తిగా ఫీలయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం అవన్నీ పుకార్లేనని, నాగార్జున ఈ సినిమా పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.

భాస్కర్ ఈ సినిమాని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నాడట. ప్రేమ కథా చిత్రాలని విభిన్నంగా తెరకెక్కించే భాస్కర్ ఈ సినిమాతో మరో సరికొత్త లవ్ స్టోరీని మనకి పరిచయం చేయబోతున్నాడు. ఆల్ మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తయిందట. పూజా హెగ్డే, అఖిల్ ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయట. లాక్డౌన్ పూర్తయిన వెంటనే పూజా, ఈ సినిమా కోసమే తన సమయాన్ని కేటాయించనుందట. అన్నీ కుదిరి థియేటర్లు తెరుచుకుంటే ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా రిలీజ్ చేస్తారట.

Those are false news from Most eligible bachelour

akhil
most eligible bachelour
tollywood
telugu film industry
bommarillu bhaskar