ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా.. మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం పక్కనబెడితే.. ఈసినిమా ఓపెనింగ్ ఫొటోస్ ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఆ ఫొటోస్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ సినిమా ఇంకా పూర్తికాకుండానే ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా మూవీకి కనెక్ట్ అయ్యాడు.
భారీ బడ్జెట్‌తో భారీగా నాగ్ అశ్విన్.. ప్రభాస్‌తో పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసాడు. అయితే తాజాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా కథనం ప్రకారం ఇది ఓ సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. సామాన్య మానవుడు, దేవకన్యకు పుట్టిన ఓ వన్దర్ కిడ్ స్టోరీనే అని.. ఒకానొక చిత్రమైన పరిస్థితిలో సాధారణమైన మానవుడికి .. దేవకన్యకి జన్మించిన వాడిగా కనిపిస్తాడనేది తాజా సమాచారం. మానవుడికి .. దేవకన్యకి జన్మించిన బిడ్డ పెరిగి పెద్దయ్యాక అతను ఎలాంటి అద్భుతాలు చేస్తాడనేదే ప్రధానమైన కథాంశమని అంటున్నారు.