పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేద్దాం అనుకుంటే .... కరోనా మహమ్మారి పవన్ ఆశలపై నీళ్లు చల్లింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఈపాటికి థియేటర్స్ లోకి రావాలి.. కానీ కరోనా అడ్డు పడింది. వకీల్ సాబ్ పాటు క్రిష్ సినిమా షూటింగ్స్ అతలాకుతలం అయ్యింది. మరోపక్క హరీష్ శంకర్ లైన్‌లో ఉన్నాడు. ఇక పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ సినిమాలను పవన్ చేయబోతున్నాడనే న్యూస్ నడిచింది. అయితే పూరి, త్రివిక్రమ్ సినిమాలేవో తెలియవు కానీ... ఈలోపు మరో డైరెక్టర్ లైన్ లోకొచ్చాడు.
అదే ‘గోపాల గోపాల’ దర్శకుడు డాలీతో పవన్ కళ్యాణ్ సినిమా అంటూ ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్‌ని కలిసి డాలీ ఓ కథ వినిపించాడని.. ఇద్దరి మధ్యన కథ గురించి చర్చలు జరిగాయని.. అన్ని సెట్ అయితే.. 2021 చివర్లో డాలి సినిమా పక్కా అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్‌కి డాలీకి మధ్యన ఎలాంటి కథా చర్చలు జరగలేదని.. అసలు పవన్ కళ్యాణ్‌కి హరీష్ సినిమా తర్వాత మరో సినిమా చేసే ఆలోచనే లేదని.. అంటుంటే.., పవన్ - డాలీ కాంబో కోసం నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ని అప్రోచ్ అయ్యారని.. కానీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని అంటున్నారు.