మహానటి బ్లాక్ బస్టర్ తర్వాత కీర్తి సురేష్... కెరీర్ ఓ ఊపు ఊపుతుంది అనుకుంటే.. దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మహానటి హిట్ తర్వాత వరస ప్లాప్స్. ఆమె బరువు వలన కీర్తికి అవకాశాలు రాలేదు. కానీ గత ఏడాది చివరి నుండి కీర్తి సురేష్ కెరీర్ ఊపందుకుంది. బాలీవుడ్ సినిమాని వదిలేసినా.. తెలుగులో మూడు సినిమాలకు సైన్ చేసింది. అలాగే కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో కమిట్మెంట్స్ ఇచ్చింది. తాజాగా నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తుంటే... నితిన్ కీర్తికి మరో అవకాశం ఇచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ మసాలా పవర్ పేట సినిమా ఓకే చేసిన నితిన్ కి ఆ సినిమాలోనూ కీర్తి సురేష్ కావాలట.
ఇక ఈ సినిమా ఓ రేంజ్ లో అంటే పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. హిందీ తప్ప తెలుగు, తమిళ, మలయాళం లలో పవర్ పేట రిలీజ్ ఉండబోతుంది. అందుకే కీర్తి సురేష్ క్రేజ్ మూడు భాషలకు పనికొస్తుందని.. కీర్తి ని ఫైనల్ చేశారట. మరోపక్క మహేష్ - పరశురామ్ మూవీలోనూ కీర్తి సురేష్ ఫైనల్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి కీర్తి సురేష్ రెండేళ్లు కామ్ అయిన.. ప్రస్తుతం చేతినిండా సినిమాల్తో బిజీ అయ్యింది.