Advertisementt

మహర్షి సినిమాలో మహేష్ కి నచ్చిన సాంగ్..?

Sun 10th May 2020 04:25 PM
mahesh babu,devi sri prasad,vamshipaidipally,sitara,gautham,dilraju  మహర్షి సినిమాలో మహేష్ కి నచ్చిన సాంగ్..?
Mahesh Favourite song from Maharshi movie..? మహర్షి సినిమాలో మహేష్ కి నచ్చిన సాంగ్..?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చాయి. అయితే ఈ సినిమా రిలీజై ఏడాది కావొస్తున్న సందర్భంగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. మహర్షి సినిమా ఆల్బమ్ కి మంచి పేరొచ్చింది.

దేవిశ్రీ అందించిన పాటలు జనాలని బాగా అలరించాయి. ముఖ్యంగా పదర..పదర. పదరా అనే పాట అందర్నీ ఆకర్షించింది. అయితే హీరోగా చేసే వాళ్లకు తమ సినిమాల్లోని అన్ని పాటలు నచ్చుతుంటాయి. స్పెషల్ గా ఒక ప్రత్యేకమైన సాంగ్ అంటే ఏదీ చెప్పలేరు. కానీ ట్యూన్ విన్నప్పుడు హీరో ఇచ్చే ఎక్స్ ప్రెషనే ఆ పాటంటే ఆయనకి ఉన్న ఇష్టాన్ని గురించి తెలియజేస్తుంది. మహేష్ బాబు విషయంలోనూ అదే జరిగింది.

మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నప్పుడు దేవిశ్రీ పాలపిట్ట అనే పాట ట్యూన్ ని మహేష్ కి వినిపించాడు. ఆ ట్యూన్ ని విన్న మహేష్, వెంటనే లేచి దేవికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆదిరిపోయిందంటూ చెప్పాడట. ఆ పాట వినగానే ఆయన రెస్పాన్స్ ఇది అంటూ దేవి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో మహేష్, వంశీ పైడిపల్లితో పాటు సితార, గౌతమ్ లను కూడా  చూడొచ్చు.

Mahesh Favourite song from Maharshi movie..?:

Mahesh favourite song from Maharshi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ