కరోనా కారణంగా సినీ పరిశ్రమ చాలా గందరగోళంగా మారింది. సినిమాల షూటింగ్స్, రిలీజ్‌లు ఆగిపోయాయి. చాలా గ్యాప్ రావడంతో తమిళంలో హీరో సూర్య భార్య జ్యోతిక సినిమా కూడా పొన్మగాల్ వందాళ్ సినిమాను డైరెక్టుగా ఓటిటి రిలీజుకు ఇచ్చేశారు. ఇప్పుడు అది హాట్ టాపిక్ అయింది. థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా ఓటిటి రిలీజుకు ఎలా ఇస్తారు అని థియేటర్స్ సంఘం అడ్డుపడింది.
ఇక తమిళ హీరో విజయ్, ధనుష్ సినిమాలు ఎంత లేట్ అయినా పర్లేదు కానీ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాం అంటున్నారు. విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో అలానే ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమాను మే1న రిలీజ్ చేయాలని షెడ్యూల్ చేశారు. కానీ లాక్ డౌన్ వల్ల లేట్ అవుతుంది. అయితే డిజిటల్ సంస్థల నుంచి ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందట. కానీ ధనుష్ అండ్ విజయ్ మాత్రం అందుకు నో అని చెబుతున్నారు. ‘మేం సినిమాలు చేసేది అభిమానుల కోసం… థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్ కోసం…’ అంటూ ఓటీటీ ఆఫర్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడట విజయ్. దాంతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి గట్టి దెబ్బ తగిలింది.