Advertisementt

‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అంటున్న బర్త్‌డే భామ!

Mon 11th May 2020 02:21 PM
sreemukhi,its time to party,first look,birthday special  ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అంటున్న బర్త్‌డే భామ!
First Look of ‘It’s Time to Party’ unveiled on Sreemukhi’s birthday ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అంటున్న బర్త్‌డే భామ!
Advertisement
Ads by CJ

శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్, ‘బిగ్ బాస్ 3’ ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. ఆదివారం (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సినిమాలో శ్రీముఖిగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ, ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్‌ప్రైజ్ ఇస్తుంది. పాత్రలో ఆవిడ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అని అన్నారు.

శ్రీముఖి, దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పిఆర్ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, ఎడిటర్: అనిల్ కుమార్ పి, కెమెరామెన్: దిలీప్ కుమార్ ఎంఎస్, సంగీతం: శేఖర్ మోపూరి, సహ నిర్మాత: సిహెచ్ వేణు మాధవ్, నిర్మాతలు: అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్, దర్శకుడు: గౌతమ్ ఇ.వి.ఎస్

First Look of ‘It’s Time to Party’ unveiled on Sreemukhi’s birthday:

Sreemukhi ‘It’s Time to Party’ first Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ