Advertisementt

సాయిపల్లవికి తప్పిన గండం..

Sat 09th May 2020 03:48 PM
sai pallavi,rana daggubati,venu udugula,virataparvam  సాయిపల్లవికి తప్పిన గండం..
Scary incident from Ranas Virataparvam.. సాయిపల్లవికి తప్పిన గండం..
Advertisement
Ads by CJ

ఫిదా సినిమాతో అందర్నీ మెస్మరైజ్ చేసిన సాయిపల్లవి ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ ఒకటి కాగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం మరోటి. రానా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా అడవుల్లోనే జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని నక్సలైట్ల గురించిన కథాంశంతో విభిన్నంగా తీర్చిదిద్దబడుతున్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్, కేరళ, వరంగల్ అడవుల్లో జరిగింది.

అయితే ఒకసారి షూటింగ్ ప్యాకప్ చేసుకుని హోటల్ కి వెళ్తున్న టైమ్ లో ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చిందట. ఇరవై దాకా ఉన్న ఆ ఏనుగులని చూసిన వారంతా తలా ఒక దిక్కుకి పోయారట. అక్కడ దర్శకుడు వేణుతో పాటు హీరోయిన్ సాయిపల్లవి కూడా ఉంది. అయితే అక్కడి నుండి తప్పించుకుని సురక్షిత ప్రాంతాల్లోకి వచ్చేశారట. ఎలాంటి నష్టం జరగలేదు కాబట్టి, ప్రస్తుతం ఆ సంఘటన గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారిపోయింది. నేడు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా విరాట పర్వంలోని ఆమె లుక్ ని రివీల్ చేసింది చిత్రబృందం.

Scary incident from Ranas Virataparvam..:

Scary Incident from Rana Daggubati Viirataparvam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ