మిల్క్ బాయ్ మహేష్ వరస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల హిట్ ఆ తర్వాత వంశీ పైడిపల్లి సినిమాని పక్కనబెట్టి.. పరశురామ్‌కి కనెక్ట్ అయిన మహేష్ బాబు.. తదుపరి చిత్రాన్ని రాజమౌళితో చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌తో తన పిల్లలతో ఆడుకుంటున్న మహేష్ బాబు తన భార్యతో కలిసున్న ప్రతి క్షణం తనకి రొమాంటిక్ అంటున్నాడు. తనకు తన ఫ్యామిలీ కంటే మరేదీ ఎక్కువ కాదని.... ఇక తనగురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే హంబుల్ హంబుల్ హంబుల్ అంటూ చెబుతున్నాడు.
ఇక తాను కెరీర్ తొలినాళ్లలో నటించిన మురారీ మూవీ చూసి తండ్రి కృష్ణగారు తన భుజం మీద చేయి వేసి, ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ తనకి బెస్ట్ మూమెంట్స్ అంటున్నాడు. తాను చాలా అణుకువుగా ఉంటా అని.. ఇక నిజాయితీ లేని మనుషులను చూస్తే తనకు ఒళ్ళు మంట వస్తుందని చెబుతున్నాడు మహేష్ బాబు. ఇక ఎవరైనా మీ బయోపిక్ తీస్తా.. అని అడిగితే మాత్రం.. తనకు బయోపిక్ తీసేంత అవసరం లేదని... తాను చాలా సాధారణ జీవితం గడుపుతున్నా అని.. అలాంటి నాపై బయోపిక్ తీయాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు మహేష్ బాబు.