దాత, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతలకు, సినీ వర్కర్స్ కు వారికి మూడో విడత సహాయం
దాత, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఇంతకముందు 20,22,222 రూపాయలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా సహయం చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఫిలిం మీడియేటర్స్‌కి, పేస్టింగ్ బాయ్స్‌కి, రిప్రజెంటేటివ్లకి, మేకప్, కాస్టూమ్స్, సెట్, ఫైటర్స్, లేడిడాన్సర్స్ సహాయకులకు మరియు ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్‌కి, కరోనా కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్న పైవారికి సహాయం చెయ్యమని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నగారికి, ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డిగారికి 10,11,111(పదిలక్షల పదకొండు వేల నూటపదకొండు రూపాయలు) అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా దాత, నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘‘లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఇంతకముందు 20,22,222 రూపాయలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా ..నిర్మాతలకి మరియు ఫిలిం ఛాంబర్ ఎంప్లాయిస్‌కు ప్రొడక్షన్స్ మేనేజర్స్‌కి బాయ్స్‌కి సహయం చేశాను. మరియు అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఫిలిం మీడియేటర్స్, పేస్టింగ్ బాయ్స్, రిప్రజెంటేటివ్, మేకప్, కాస్టూమ్స్, సెట్, పైటర్స్, లేడిడాన్సర్స్ సహాయకులకు మరియు ఆర్టిస్ట్ నాన్ మెంబర్స్‌కు ఆర్థికంగా సహాయం చేశాను. కరోనా కారణంగా రోజు గడవడానికి ఇబ్బంది పడుతున్న వారి ఆదుకోవాలని కోరుతూ.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నగారికి ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డిగారికి 10,11,111(పదిలక్షల పదకొండు వేల నూటపదకొండు రూపాయలు) అందజేయడం జరిగింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ధికంగా వెనుకబడిన సినీ వర్కర్లకు నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ఈ విడతలో సహాయం చేస్తున్నాను. నేను ఇప్పుడు వారికి సహాయం చెయ్యడం జరిగింది, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు సహాయం చెయ్యడానికి ముందు ఉంటాను, ఇటీవల చూశాను మీడియా వారికి కూడా కరోనా వచ్చింది, కావున జాగ్రత్తగా ఉండండి’’ అని తెలిపారు. ఇప్పటివరకు చేసిన మొత్తం సహాయం రూ. 30,33,333/-