రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా సంచలనం సృష్టించడమే కాదు... విన్నర్స్ ఎవరికీ రానంత క్రేజ్ రాహుల్ కి వచ్చింది. ఆ క్రేజ్ తోనే రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ పరంగా బాగా బిజీ అయ్యాడు. దానికి తోడు ఫ్రెండ్స్ పార్టీలు, పబ్స్ అంటూ రాహుల్ హడావిడి చేసే క్రమంలో ఓ పబ్ లో రాహుల్ సిప్లిగంజ్ తల మీద బీరు బాటిల్ పగిలింది. ఓ ఎమ్యెల్యే కొడుకు ఆ బీరు బాటిల్ పగలగొట్టడంతో రాహుల్ సిప్లిగంజ్ బాగా హైలెట్ అయ్యాడు. రాహుల్ మీడియా ముఖంగా ఆ ఎమ్యెల్యే కొడుకు మీద యాక్షన్ తీసుకోవాలని డైరెక్ట్ గా కేటీఆర్ కే ట్వీట్ వేసాడు. అయితే రాహుల్ కేసు.. కరోనా లాక్ డౌన్ తో మూతపడింది.
తాజాగా రాహుల్ ఆ కేసులో ఉన్న భారీ ట్విస్ట్ ఒకటి బయటపెట్టాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యింది అని.. క్లైమాక్స్ ఇంకా ఉందని.. బయటికి తెలియకుండా తెరవెనుక ఏం జరిగిందో బయటపెట్టాడు. తన మీద పబ్ లో బాటిల్‌తో దాడి చేసిన తర్వాత ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వినయ్ భాస్కర్ ద్వారా తన ఇంటికి వచ్చి కలిసి తనకు సారీ చెప్పారని.. కానీ తన మీద దాడి చేసిన రితేష్ మాత్రం తన దగ్గరకు రాలేదని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్. అయితే ఈ సంఘటన తర్వాత రితేష్‌కు మొహం చూపించడానికి సిగ్గేసినట్టు ఉంది... అసలు రితేష్ చేసే పనులతో వాళ్ల అన్నయ్యకు చెడ్డ పేరు వస్తుందని... వాళ్ళు వచ్చి కేసు విత్ డ్రా చేసుకోమని కోరారు. కానీ రితేష్ వచ్చి మీడియా ముఖంగా సారి చెబితేనే కేసు వాపస్ తీసుకుంటామని చెప్పానని చెబుతున్నాడు రాహుల్. మరి రాహుల్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.